Movie News

ప్రతినిధి 2 టాక్

నారా రోహిత్ హీరోగా.. సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘ప్రతినిధి 2’. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈరోజు (మే 10) ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తాలూకా టీజర్ , ట్రైలర్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో సినిమా ఎలా ఉండబోతుందో..అధికార పార్టీ ఫై మూర్తి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో..చంద్రబాబు కు ఎంత అనుకూలంగా సినిమా తీసాడో అని అంత భావించారు. కానీ సినిమా మాత్రం ఆలా ఏమిలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం టచ్ చేయలేదు.

కేవలం సీఎం మర్డర్ మిస్టరీ చుట్టూ పొలిటికల్ డ్రామా మాత్రమే చూపించారు. అక్కడక్కడా పరిధి దాటి పొలిటికల్ సెటైర్లు వేయించినా.. సెన్సార్‌ బీప్‌లు చాలా చోట్ల కనిపించాయి. ‘పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయ్.. మనల్ని ఎవడేం చేస్తాడు’, ‘నాన్నగారు చనిపోయి రోజులు కూడా కాలేదు.. అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టేశారా?’, ‘సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్‌లు వేసేశాం.. ఇంకా చెప్పడానికి వాళ్లు వినడానికి మిగిలిందేం లేదు’ ఇలాంటి డైలాగ్‌లతో అధికార పార్టీని కెలికినట్టుగానే అనిపిస్తాయి కానీ.. వాటిని కథకి కనెక్ట్ చేసి అబ్బే అలాంటిదేం లేదన్నట్టుగానే మురాతి తన డైరెక్షన్ ప్రతిభ చూపించాడు.

జర్నలిస్ట్ మూర్తికి ఇది ఫస్ట్ చిత్రమే కానీ.. టెక్నీషియన్స్ అంతా సీనియర్స్ కావడంతో కొత్త దర్శకుడు అనే ఫీల్ ఎక్కడ కనిపించలేదు. మూర్తి పసుపు మరకను.. పొలిటికల్ అజెండాను పక్కనపెడితే.. వ్యవస్థని ప్రశ్నించే నిఖార్సైన జర్నలిస్ట్‌ ఎలా ఉండాలని కలలు కంటాడో అలాగే చూపించి ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ గా మూర్తి సక్సెస్ అయ్యాడు. నిజాయితీ గల జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ ఆకట్టుకున్నాడు. మిగతా నటి నటులంతా బాగా చేసారు. ఓవరాల్ గా ప్రతినిధి 2 అలరించే మూవీ అని అంత అంటున్నారు.