తెలుగు వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నిర్మాత గౌరీ కృష్ణ

తమ నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ ( ?) సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఆదర్శంగా తీసుకొని ఈరోజు తమ నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?) ఆడియో రిలీజ్ కార్యక్రమం సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకోని నేడు మొక్కలు నాటిన క్వశ్చన్ మార్క్ సినిమా (?) నిర్మాత (శ్రీకృష్ణ క్రియేషన్స్) గౌరీ కృష్ణ .


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మాకు ఆదర్శంగా నిలిచిందని ఈ రోజు మా నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ ఆడియో రిలీజ్ సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశంతో ఈ రోజు మొక్కలు నాటడం జరిగిందన్నారు.


భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని మొక్కలు పెంచడం అందరు బాధ్యతగా తీసుకొని పెంచినట్లయితే వాతావరణ కాలుష్యం తగ్గిపోతుందని తెలిపారు.


ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని ఈ సందర్భంగా మా క్వశ్చన్ మార్క్ సినిమా హీరోయిన్ ఆదాశర్మ; మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె; దర్శకులు ప్రసాద్; విజయవర్మ లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.