Movie News

ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెడుతున్న ప్రభాస్

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్..ఆ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కాకపోతే బాహుబలి తర్వాత వరుస ప్లాప్స్ ఎదురుకున్నాడు. రీసెంట్ గా సలార్ తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ బాటలోకి వచ్చాడు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్లో ఓ సినిమా , నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి ఇలా ఉండగానే మరో రెండు సినిమాలను ఒకేసారి లైన్లో పెడుతున్నట్లు తెలుస్తుంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్సాల్సిన పీరియాడిక్‌ లవ్​ డ్రామాను జులైలో ప్రారంభించనున్నారని సమాచారం. అలాగే దీంతో పాటు, సలార్‌ 2 షూటింగ్​ను స్టార్ట్ చేయనున్నారని సమాచారం అందింది. వచ్చే నెల నుంచే ప్రభాస్‌ లేకుండానే సలార్‌ 2 షూటింగ్ మొదలు కానుందట. అయితే ప్రభాస్​ జులై నుంచి ఈ మూవీ షూటింగ్​లో పాల్గొనున్నట్టు తెలిసింది. అంటే ఒకే నెలలో రెండు సినిమాల చిత్రీకరణలో ఆయన పాల్గొనున్నారనమాట. అలానే మరోవైపు రాజాసాబ్‌ షూటింగ్​ను పూర్తి చేయనున్నారు. ఇంకా ఈ సంవత్సరంలోనే సందీప్‌ రెడ్డి వంగా చిత్రాన్ని కూడా మొదలు పెడతారట. ఈ లైనప్​ చూస్తుంటే ఫ్యాన్స్​కు ఇక పండగే అని తెలుస్తోంది.