Wednesday, October 23, 2024
HomeMovie Newsకల్కి నుండి దిశా లుక్ కేక

కల్కి నుండి దిశా లుక్ కేక

- Advertisement -

మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ , ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు లో వరుస సినిమాలు నటిస్తోంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈమె మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసి అనేక అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో టాప్ బ్యూటీ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమాలో సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ రోజు ఈ బ్యూటీ పుట్టిన రోజు కావడంతో కల్కి మూవీ యూనిట్ ఈ సినిమా నుండి దిశా పటాని కి సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఎడి. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో చేస్తూ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెంచేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్​ భైరవ అనే పాత్రలో నటిస్తుండగా ఆయనకు తోడుగా బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ రోబోటిక్ కారు కూడా సినిమాలో కనిపిస్తుంది.

బుజ్జి – భైరవల మధ్య నడిచే ట్రాక్ సినిమాకే హైలెట్​గా నిలవనుందని, సినీ లవర్స్​ను కట్టిపడేయనుందని మూవీటీమ్​ చెబుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు దిశా బర్త్ డే సందర్బంగా ఆమె తాలూకా లుక్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. కల్కి చిత్రంలో దిశా ‘రోక్సీ’ అనే పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో దిశా లుక్ అదిరిపోయింది. ట్రైలర్‌‌ను గమనిస్తే ప్రభాస్‌ను ప్రేమించే అమ్మాయి రోల్‌లో దిశా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ సినిమాలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే ట్రైలర్‌లో ఓ ఫైట్‌ సీన్‌లో కూడా దిశా కనిపించింది. ఇక ప్రభాస్-దిశా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇటలీలోని ఓ బీచ్‌లో ఈ సాంగ్‌ను షూట్ చేశారు. అప్పుడు తీసుకున్న ఫొటోలను కూడా దిశా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె తొలిసారి నటిస్తుంది. అలానే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం వంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కల్కి 2898 AD జూన్ 27న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read