Tuesday, December 24, 2024
HomeMovie News'విశ్వంభర' లో చిరంజీవివి డ్యుయల్ రోల్..?

‘విశ్వంభర’ లో చిరంజీవివి డ్యుయల్ రోల్..?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి , త్రిష జంటగా బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘విశ్వంభర’. హై వీఎఫ్​ఎక్స్, సోసియో ఫ్యాంటసీ జానర్​గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ వస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్​లో తాజాగా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్​లో హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాలు షూట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ మూవీ లో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నారనే ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఈ రెండో క్యారెక్టర్ ప్రీ ఇంటర్వెల్ సన్నివేశంలోనే రివీల్ కానుందట. దీన్ని భారీ యాక్షన్ సీన్స్​తో ఎలివేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్​ను టచ్​ చేస్తూ, రెండో పాత్రను పరిచయం చేయనున్నారట. ఈ సీన్ సినిమాకే హైలైట్​గా నిలవనుందట. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. యంగ్ బ్యూటీ రమ్య పసుపలేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నందూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.150 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 10న విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read