ఈసారి ఏపీలో ఎన్నికలు నువ్వు..మీమా..అన్న రేంజ్లో వైసీపీ vs కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి ఇరు పార్టీల అధినేతలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే…గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్..ఈసారి గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు మొదలుపెట్టారు. సింగిల్ గా వెళ్తే జగన్ ను ఓడించలేమని చెప్పి…చంద్రబాబు , మోడీ లతో కలిసి కూటమి గా ఏర్పడి బరిలోకి దిగుతున్నారు.
ఈ క్రమంలో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ , 02 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్..ఈసారి పిఠాపురం లో విజయం సాధించి తీరాలని చూస్తున్నాడు. ఇప్పటికే పిఠాపురంలో పర్యటించగా..పవన్ కోసం చిత్రసీమ కూడా కదిలింది. ఇప్పటికే మెగాస్టార్ తన మద్దతును ప్రకటించగా..వరుణ్ తేజ్ , బుల్లితెర నటి నటులు , వెండితెర పలువురు నటులు ప్రచారం చేస్తున్నారు..అలాగే మరికొంతమంది పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నేరుగా పవన్ కోసం పర్యటించబోతున్నట్లు వినికిడి.
“రేపు 5వ తేదీన మెగాస్టార్ చిరంజీవి ప్రచారానికి వస్తున్నారు.. దుమ్ముదులిపేస్తారు. చిరంజీవి గారు ఇక్కడ అద్భుతమైన పరిపాలన రావాలి. కూటమి అభ్యర్థులు గెలవాలి అని చెప్పి ఆయన షూటంగ్ కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ నా తమ్ముడు.. జనసేన నా తమ్ముడి పార్టీ.. నా గుండెల్లో తమ్ముడు ఉంటాడు.. ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు అని చెప్పిన వ్యక్తి మెగాస్టార్. ఆయన మే 5 నుంచి మే 11 వరకూ ఎడతెరగని బహిరంగ సభలు నిర్వహిస్తారు. చూసుకోండి ఒక పక్క చంద్రబాబు .. మధ్యలో చిరంజీవి గారు.. అటు పక్కన పవన్ కళ్యాణ్.. అసలు ఆ సభ చూస్తుంటేనే జనాలు ఓట్లు గుద్దేస్తారు.” అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు. నిజంగా చిరంజీవి వస్తే ఇక పిఠాపురంలో తిరుగుండదని అంటున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖుల మద్దతుతో కూటమి ఫై ప్రజల్లో నమ్మకం పెరుగుతుండగా..ఇక చిరంజీవి నేరుగా దిగితే ఆ లేక వేరే లెవల్లో ఉంటుందని అంటున్నారు. మరి చిరంజీవి వస్తారా..లేదా అనేది చూడాలి.