Movie News

బార్ లో గడిపిన పూరి హీరోయిన్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన హార్ట్ ఎటాక్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన అదాశర్మ..తెలుగులో పలు చిత్రాలు చేసినప్పటికి స్టార్ హీరోయిన్ కాలేకపోయింది..కానీ కేరళ స్టోరీ మూవీ తో మాత్రం అమ్మడు విపరీతమైన పాపులార్టీ తెచ్చుకుంది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.300 కోట్లు రాబట్టి శభాష్ అనిపించుకుంది. ఈ సినిమా తో అదాశర్మ కు వరుస ఛాన్సులు తలుపుతడుతున్నాయి. ఈ సినిమా తర్వాత బస్తర్ అనే సినిమాలోనూ నటించింది. దీంతో పాటుగా సన్​ఫ్లవర్‌ అనే సిరీస్​లోనూ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ వెబ్​సిరీస్‌లో అదా ఓ బార్ డ్యాన్సర్​గా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ పాత్ర గురించి పలు విషయాలు వెల్లడించింది. తన పాత్రలో నేచురల్​గా కనిపించేందుకు డ్యాన్స్ బార్​లో కొద్ది రోజుల పాటు ఆమె గడిపినట్లు చెప్పుకొచ్చింది.

‘చూసేవాళ్ల కళ్లకు వాస్తవంగానే అనిపించాలి. కరెక్ట్ పర్‌ఫామ్ చేయకపోతే నిల్చొన్నా, కూర్చొన్నా అందులో సహజత్వం కనిపించదు. ఇవన్నీ గమనించేందుకు బార్​లోనే గడిపాను. అక్కడ కస్టమర్లతో మాట్లాడి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకూ వెళ్తూ ఉండేదాన్ని. రాత్రి 9 గంటలకు వెళ్లి ఉదయం 4 – 5 వరకూ అక్కడే ఉండేదాన్ని” అని అదా శర్మ తెలిపింది. ఈమె చెప్పిన విషయాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. పాత్ర ఫై ఇంట్రస్ట్ ఉంటె..ఆ పాత్రకోసం ఎంతైనా చేసే వాళ్లు తక్కువగా ఉంటారని..అలాంటి వారిలో అదాశర్మ ఒకరు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.