Monday, December 23, 2024
HomeMovie Newsవివాదంలో అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' టీజర్

వివాదంలో అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ టీజర్

- Advertisement -

అల్లరి నరేష్ నటిస్తున్న ‘బచ్చల తల్లి ‘ మూవీ టీజర్ వివాదంలో చిక్కుంది. రీసెంట్ గా నరేష్ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ టీజర్ లో అల్లరి నరేష్ తెల్లవారుజామున తన నిద్రను చెడగొడుతూ మోగుతున్న మైకును కోపంతో నేలకు విసిరేస్తారు. అయితే ఆ సమయంలో అందులో ‘భగవద్గీత’ వస్తూ ఉంటంది. దీనిపైనే పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

భగవద్గీత వినిపించే మైక్‌ను నేలకి విసిరికొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. “హీరో అల్లరి నరేష్, సినిమా డైరెక్టర్ వెంటనే ఈ సీన్‌ను తొలగించాలి. ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. అలానే ఈ సీన్‌ను చిత్రంలో ఎందుకు పెట్టారో వివరణ కూడా ఇవ్వాలి. హిందువలకి క్షమాపణ చెప్పాలి” అంటూ కొంతమంది హిందుత్వవాదులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ‘హనుమాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అమృత అయ్యర్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

We demand @allarinaresh and the director of #BachhalaMalli and team to remove the starting scene of the teaser it hurts our hindu sentiments. And we demand an explanation for making a scene like this?#BoycottBachhalaMalli pic.twitter.com/TqjHaXarhf— Chay 🚩 (@UddJaaPerindeyy) June 30, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read