Friday, September 5, 2025
HomeMovie Newsప్రభాస్ లాంచ్ చేసిన ఘాటి యాక్షన్ రైడ్‌ రిలీజ్ గ్లింప్స్ 

ప్రభాస్ లాంచ్ చేసిన ఘాటి యాక్షన్ రైడ్‌ రిలీజ్ గ్లింప్స్ 

క్వీన్ అనుష్క శెట్టి, విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా’ ఘాటి’ మరికొన్ని గంటల్లో తెరపైకి రానుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అంచనాలని పెంచింది. విడుదలకు ఒక రోజు ముందు రెబెల్ స్టార్ ప్రభాస్ ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. 

- Advertisement -

అనుష్క శెట్టి శీలావతి పాత్రలో అదరగొట్టారు. ఘాటీ సమాజం ఎదురుకుంటున్న పరిస్థితులకు ఎదురుతిరి ఆమె చేసిన పోరాటం గూజ్బంప్స్ తెప్పించింది. దర్శకుడు క్రిష్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇంటెన్స్, ఎమోషన్ రెండింటిని అద్బుతంగా బ్యాలెన్స్ చేసి అడ్రినలిన్ రష్ ఇచ్చేలా తీర్చిదిద్దారు. 

విద్యాసాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ నెక్స్ట్ లెవల్ లో వుంది. రామ్ కృష్ణ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు రియలిస్టిక్‌గా అదిరిపోయాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా ఘాట్ల, రివల్యూషన్ గ్రాండియర్ రెండింటినీ అద్భుతంగా చూపించింది.

అనుష్క పెర్ఫార్మెన్స్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా వుంది. ఇంటెన్స్, రిజిలియన్స్‌తో కూడిన ఆమె నటనలో ఒక్క డైలాగ్‌తోనే గ్లింప్స్ ఇంపాక్ట్ వచ్చేసింది. విక్రమ్ ప్రభు కూడా ఇంటెన్స్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్, ఎడిటర్స్ చాణక్య రెడ్డి తూరుపు – వెంకట్ ఎన్. స్వామి వర్క్ కూడా హైలైట్‌గా నిలిచింది. 

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, UV క్రియేషన్స్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఘాటీ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. థియేటర్స్‌లో రేపట్నుంచే ఈ ఇంటెన్స్ యాక్షన్ రైడ్‌కు గెట్ రెడీ. 

క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఘాటి రేపే రిలీజ్‌ అచుతుంది. అనుష్క వర్చువల్‌ ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఫోన్ కాల్ లో మాట్లాడారు.   

‘వేదం’,‘రుద్రమదేవి’ సినిమాలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు స్టార్స్, ఫోన్‌లో కూల్‌గా మోమోరిస్ ని రీఫ్రెష్ చేసుకున్నారు. అనుష్క మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో చేసిన చాలెంజింగ్ రోల్స్ బన్నీ ఏదో ఒక రూపంలో పార్ట్ అయ్యారు. ఇప్పుడు ఘాటీ కోసం ఫోన్ కాల్ సర్ ప్రైజ్.   

ఘాటిలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..“ఈ రోల్ కేవలం యాక్షన్ మాత్రమే కాదు… ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. క్రిష్ నన్ను కంప్లీట్‌గా కమ్ఫర్ట్‌జోన్‌కి బయటికి తెచ్చి వర్క్ చేయించారు. 

అల్లు అర్జున్ వెంటనే రియాక్ట్ అయ్యి.. “అనుష్క… నువ్వు ఓ గ్రేట్ లీగ్‌లో ఉన్నావ్. నేటి హీరోయిన్స్‌లో ఇలా యాక్షన్ రోల్స్ ఎవరూ చేయరు.    

అంతలో బన్నీ ఓ క్రియేటివ్ ఐడియా కూడా ఇచారు. “పుష్ప, శీలావతి క్రాస్‌ఓవర్ చేస్తే బాగుంటుంది కదా? రెండు పార్ట్స్‌గా చేద్దాం. ఒకటి సుకుమార్, మరొకటి క్రిష్ డైరెక్ట్ చేస్తే అద్భుతంగా వుంటుంది. 

దానికి అనుష్క అందుకు ముందు నేను పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించాలి” అని చెప్పేసరికి, బన్నీ వెంటనే రియాక్ట్ అయ్యి.. నువ్వు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్… బాహుబలి దానికి ప్రూఫ్ అయ్యింది’అన్నారు  

ఫైనల్ గా బన్నీ ఘాటిని తన ఫ్యామిలీతో చూసే ప్లాన్ చెబుతూ, అనుష్కకి, మూవీ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

ఇద్దరి స్టార్స్ మధ్య జరిగిన ఈ స్పాంటేనియస్ కన్‌వర్సేషన్ ఘాటి రిలీజ్ మీద ఎక్సైట్‌మెంట్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read