Saturday, January 11, 2025
HomeMovie Newsపుష్ప తో బన్నీ సంబంధం తెగిపోయింది

పుష్ప తో బన్నీ సంబంధం తెగిపోయింది

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమాపై ప్రేక్షకులలో తీవ్ర ఉత్సాహం నెలకొంది. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ తన పుష్ప ప్రయాణం ముగిసిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఈ ప్రయాణం ఎంతో అద్భుతమైందని, చివరి రోజు చివరి షాట్ చాలా భావోద్వేగంగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆన్-లొకేషన్ ఫొటోను పంచుకోవడంతో అభిమానుల్లో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, సెన్సార్ కార్యక్రమాలకు త్వరలో ఫైనల్ కాపీ పంపే అవకాశాలు ఉన్నాయి. పుష్ప-2 ఆరు భాషల్లో విడుదల కానుండటంతో, ఈ సినిమాపై నేషనల్ లెవల్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన హైప్‌ను తీసుకువస్తోంది.ఈ సిరీస్ మొదటి భాగం పుష్ప: ది రైజ్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటే, పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read