Sunday, January 12, 2025
HomeNews"ది సస్పెక్ట్" చిత్ర కథానాయకుడునీ అభినందించిన"డాకు బాలయ్య!!

“ది సస్పెక్ట్” చిత్ర కథానాయకుడునీ అభినందించిన”డాకు బాలయ్య!!

“ది సస్పెక్ట్” చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్న ప్రవాస తెలుగుతేజం “రుషి కిరణ్”… “డాకు మహారాజ్”తో ఈ సంక్రాంతిని కబ్జా చేసేందుకు వస్తున్న బాలయ్య ప్రశంసలు దండిగా అందుకున్నారు. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన “డాకు మహారాజ్” ప్రి రిలీజ్ ఈవెంట్ లో “అఖండ” గెటప్ తో సందడి చేసిన బాలయ్య వీరాభిమాని రుషి కిరణ్… ఆ గెటప్పులో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించడంతోపాటు… బాలయ్య మెప్పు సైతం పొందారు. డల్లాస్ మరియు పరిసర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు 7 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సంక్రాంతికి వస్తున్న “డాకు మహారాజ్” బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని రుషి కిరణ్ ఆకాంక్షించారు. రుషి కిరణ్ నటించిన “ది సస్పెక్ట్” చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది!!

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read