‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’తో రాబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో భారీ స్థాయిలో నిర్మించబడుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ సమీపిస్తున్నందున, మిగిలిన అన్ని పోస్ట్-ప్రొడక్షన్ పనులను షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేయడానికి టీం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.
తాజాగా అఖండ 2: తాండవం కోసం బాలకృష్ణ డబ్బింగ్ పూర్తిచేశారు. ఇది సినిమా పనుల్లో ఒక ముఖ్యమైన మైల్ స్టోన్. మిగతా పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. సీజీ వర్క్, రీ-రికార్డింగ్, ఇంకా మిగతా టెక్నికల్ పనులన్నీ ఒకేసారి చేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా పెండింగ్ పనులు మొత్తం పూర్తవుతాయి. మరో మూడు వారాల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఈ దసరాకు, అంటే సెప్టెంబర్ 25న సినిమా థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ మరోసారి తెలియజేశారు.
ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. నందమూరి బాలకృష్ణను మునుపెన్నడూ లేని విధంగా ఫెరోషియస్ అవతారంలో కనిపిస్తూ అభిమానులని ప్రేక్షకులని కట్టిపడేశారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆమెతో పాటు ఎప్పుడూ వెర్సటైల్‌గా ఉండే ఆది పినిశెట్టి, ఇంటెన్సిటీ, డెప్త్ ఉన్న ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆమె కూడా స్టోరీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా కోసం అద్భుతమైన టెక్నికల్ టీం పని చేస్తోంది. ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, సి. రాంప్రసాద్ డీవోపీగా వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్‌ను తమ్మిరాజు నిర్వహిస్తుండగా, ఏఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి వరుస అప్‌డేట్స్‌తో ప్రమోషన్లు ముమ్మరం చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.