Tuesday, December 24, 2024
Homeతెలుగు వార్తలు'జీ 5' ఒరిజినల్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (OCFS) ట్రైలర్ విడుదల చేసిన...

‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS) ట్రైలర్ విడుదల చేసిన కింగ్ నాగార్జున

నవంబర్ 19న ‘జీ 5’ ఓటీటీ వేదికలో ప్రీమియర్ కానున్న వెబ్ సిరీస్

- Advertisement -

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు… ఏవి చూడాలని అనుకున్నా ప్రజల ఫస్ట్ ఆప్షన్ ‘జీ 5’. దేశంలోనే అగ్రగామి ఓటీటీ వేదిక. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ను విడుదల చేసింది. తాజాగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS) ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. 

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా… సీనియర్ నరేష్, తులసి, ‘గెటప్’ శీను ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS). మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు. 

ట్రైలర్ విడుదల చేసిన నాగార్జున గారు మాట్లాడుతూ “మనందరిదీ ఒక పెద్ద ఫ్యామిలీ. సినిమా ఫ్యామిలీ. కానీ, ఈ మహేష్ ది చిన్న ఫ్యామిలీ అంట. మరి, ఈ చిన్న ఫ్యామిలీ స్టోరీ ఏంటో చూద్దాం రండి. మామూలుగా లేదుగా ట్విస్ట్. మరి, ఈ బరువు బాధ్యత మహేష్ తీసుకుంటాడంటారా? చూద్దాం… నవంబర్ 19న ‘జీ 5’లో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని ఎక్స్‌క్లూజివ్‌గా. నిహారిక, మహేష్ ఉప్పాల, టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ట్రైలర్ చూశాక ఈ ఫ్యామిలీ స్టోరీ చూడాలని నేను కూడా వెయిటింగ్” అని అన్నారు.

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS) గురించి నిహారికా కొణిదెల మాట్లాడుతూ “ట్రైలర్ విడుదల చేసిన నాగార్జునగారికి చాలా చాలా థాంక్స్. మేం అడిగిన వెంటనే ఒప్పుకొన్నారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి వస్తే… ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్. కామెడీ డ్రామా అని చెప్పవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ నవ్వుకునేలా ఉంటుంది. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, నరేష్ గారు, తులసిగారు పాత్రల్లో జీవించారు. సిరీస్‌లో ఐదు ఎపిసోడ్స్ ఉన్నాయి. నవంబర్ 19న విడుదల చేస్తున్నాం. ‘జీ 5’లో సిరీస్ విడుదల కానుండడం ఎంతో సంతోషంగా ఉంది” అని చెప్పారు.

చక్కటి వినోదం, ప్రేమకథతో కూడిన వెబ్ సిరీస్ ఇదనీ… హీరో హీరోయిన్ల పాత్రలతో పాటు నరేష్, తులసి, బామ్మ పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయని ‘జీ 5’ ప్రతినిధులు తెలిపారు. క్యారెక్టర్ పోస్టర్లకు అద్భుత స్పందన లభించిందని సంతోషం వ్యకం చేశారు.   

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS) దర్శకుడు మహేష్ ఉప్పాల మాట్లాడుతూ “నాగబాబుగారి పుట్టినరోజు సందర్భంగా వెబ్ సిరీస్ టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశాం. తర్వాత నానిగారు టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు నాగార్జునగారు ట్రైలర్ విడుదల చేశారు. మా సిరీస్ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిన స్టార్ హీరోలకు థాంక్స్. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్… ప్రతిదానికి ప్రేక్షకుల స్పందన బావుంది. సిరీస్ కూడా ఆకట్టుకుంటుంది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సిరీస్ పిల్లలతో పాటు పెద్దల్ని కూడా ఆకట్టుకుంటుంది” అని చెప్పారు. మానసా శర్మతో కలిసి ఈ వెబ్ సిరీస్ కు మహేష్ ఉప్పాల కథ, మాటలు అందించారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read