Movie News

డైరెక్టర్ గా మారుతున్న యువన్ శంకర్ రాజా

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా..డైరెక్టర్ గా మారుతున్నారు. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ వస్తున్న రాజా..హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన యువన్ శంకర్ రాజా.. నా కొత్త సినిమాలో శింబును లీడ్ రోల్ లో నటింపజేస్తాను అని అన్నారు. దాంతో త్వరలోనే యువన్ డైరెక్టర్ గా చేస్తారని అంటున్నారు.

1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ళ వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన బిరియాని సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం.