Movie News

పవన్‌ కళ్యాణ్ కు Y ప్లస్ సెక్యూరిటీ

ఉప ముఖ్యమంత్రి, గ్రామీనాభివృద్ధి మంత్రి, జనసేన అధినేత పవన్‌కు ప్రభుత్వం Y ప్లస్ సెక్యూరిటీ భద్రత కల్పించింది ఏపీ సర్కార్.

2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున జనసేన అభ్యర్థిగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన పవన్‌ కల్యాణ్‌కు మంత్రి పదవి వరించింది. చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, అటవీ, సైన్స్‌ టెక్నాలజీ శాఖలను చంద్రబాబు అప్పగించారు.

ఈ శాఖలన్నీ తన మనసుకు చాలా దగ్గరగా ఉన్నవని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పందించారు. వాటికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి బృహత్ బాధ్యతను అప్పగించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు.

బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రకటన చేస్తారో అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పటికే పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే చంద్రబాబు ఐదు కీలకమైన సంతకాలు చేశారు. మంత్రులు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునే కీలకమైన ప్రకటనలు చేస్తున్నారు. అదే కోవలో పవన్ కల్యాణ్‌ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.

ఇక పవన్ కల్యాణ్ భద్రతను ప్రభుత్వం పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీతోపాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చింది. పవన్ కల్యాణ్ బుధవారం గ్రామీణ, పంచాయతీ, అటవీ, సైన్స్ టెక్నలజీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందే పవన్ కల్యాణ్ సచివాలయానికి చేరుకొని, తన ఛాంబర్‌ వివరాలు తెలుసుకున్నారు.