Movie News

వైభవంగా రచయిత సత్యదేవ్ జంగా పుట్టినరోజు వేడుకలు !!!

టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, నిర్మాత రాధ మోహన్, సినిమాటోగ్రఫర్ కె.కె.సెంథిల్ కుమార్, రచయితలు డార్లింగ్ స్వామి, లక్ష్మీ భూపాల, బివిఎస్ రవి, సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఆర్ ఆర్ ధ్రువన్, సింగర్ శ్రీరామ చంద్ర, నటులు రచ్చ రవి, అశ్విన్ బాబు, సింగర్ కౌసల్య, దర్శకులు వీర శంకర్, రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

రచయిత సత్యదేవ్ జంగా నేను ఏ ఫిలిం బై అరవింద్ సినిమా కథ రచయితగా పరిచయం అయ్యారు, ఆ సినిమా తరువాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 20 ఏళ్ళు వర్క్ చేశారు. టాప్ సింగర్స్ తో 200 ప్రవేట్ ఆల్బమ్స్ చేశారు.

ఆ తరువాత నాని సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ్ జంగా కు రచయితగా మంచి పేరు వచ్చింది.

ప్రస్తుతం ఎంఎల్ఏ , నేనే రాజు నేనే మంత్రి నిర్మాత భరత్ చౌదరి గారి కరణ్ సి ప్రొడక్షన్స్ లో ఆకెళ్ల వంశీ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాకు కథ అందించబోతున్నారు. ఆయన అన్ని రకాల జానర్స్ లో కథలు రెడీ చెయ్యడం జరిగింది, ఈ ఏడాది మంచి సినిమాలతో రాబోతున్నారు, సూపర్ నేచురల్, మైథలాజికల్ థ్రిల్లర్స్, హర్రర్ జానర్స్ తో పాటు ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ జానర్స్ కథలు సిద్ధం చెయ్యడం జరిగింది, వాటి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.