Movie News

‘హేమ’ ను చిత్రసీమ నుండి బహిష్కరిస్తారా..?

బెంగుళూర్ రేవ్ పార్టీ లో టాలీవుడ్ కు చెందిన నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. అసలు తాను రేవ్ పార్టీకే వెళ్లలేదని.. తన ఫామ్‌ హౌస్‌లో చిల్ అవుతున్నానంటూ చిల్ వీడియోను వదిలింది. ఆ తరువాత.. ఇంట్లోనే ఉన్నాను.. ఇదిగో బిర్యానీ చేస్తున్నాను అంటూ గరిటె తప్పిని వీడియోను షేర్ చేస్తూ.. తన నటనా ప్రావీణ్యాన్ని బయటపెట్టింది. కానీ హేమ రేవ్ పార్టీ కి వెళ్లిందని..కృష్ణవేణి పేరుతో వెళ్లడమే కాదు అక్కడ డ్రగ్స్ కూడా తీసుకుందని బెంగుళూర్ పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఆ రేవ్ పార్టీకి ఏకంగా రూ.50 లక్షలు చెల్లించి మరీ హేమ హాజరయ్యిందంటూ రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ తరుణంలో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ మాఫియా ఎక్కడ జరిగినా, రేవ్ పార్టీలు ఎక్కడ జరిగినా… ఒకరెవరో సినిమావాళ్లు పాల్గొన్నా, పట్టుబడినా ఆ నేరాన్ని సినీ పరిశ్రమకు అంతా ఆపాదిస్తున్నారన్నారు నట్టి కుమార్. దీనివల్ల సినిమా వారిని బయట చీప్ గా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి తప్పు చేసినవారు ఎవరైనా, ఎంతటివారైనా శిక్ష పడాల్సిందే అన్నారు. అందుకే సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా, నిజంగా తప్పు చేసారని నిరూపణ అయితే అలాంటి వారిని నిషేధిస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్,, పరిశ్రమకు చెందిన ఛాంబర్ వంటి సంస్థలు చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు.

హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ” నటి హేమ విషయంలో వాస్తవాలు బయటకు రావాల్సి ఉందన్నారు. ఒకవేళ ఆమె తప్పు చేసినట్లు రుజువైతే మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఆ మధ్య గోవాలో సురేష్ కొండేటి తాను ఏర్పాటు చేసిన అవార్డుల ఫంక్షన్ లో లోపాలు జరిగాయని, ఫిర్యాదులు వస్తే, అతనిని నిషేధిస్తున్నట్లు పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అతను ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ ఫంక్షన్ అది. ఆ విషయంపైనే పరిశ్రమ వర్గాలు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు హేమ విషయంలో కూడా వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిజంగా బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొనకపోతే, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ద్వారా కర్ణాటక గవర్నమెంట్ తో మాట్లాడించి, ఇందుకు బాధ్యులు పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.