Movie News

విశ్వంభర సెట్స్‌కు వివి వినాయక్‌

మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ..విశ్వంభర సెట్స్ లో సందడి చేసారు. మెగాస్టార్ చిరంజీవి , త్రిష జంటగా బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘విశ్వంభర’. హై వీఎఫ్​ఎక్స్, సోసియో ఫ్యాంటసీ జానర్​గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్​లో కొత్త షెడ్యూల్ నడుస్తుంది. ఈ షెడ్యూల్​లో హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాలు షూట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ మూవీ సెట్ కు వినాయక్ వచ్చారు.

టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్‌లో ఒకటి చిరంజీవి , వివి వినాయక్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఠాగూర్‌ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. ఇక పొలిటికల్‌ ఎంట్రీ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పిన చిరంజీవికి ఖైదీ నంబర్ 150తో గ్రాండ్‌ రీఎంట్రీ అందించాడు వివి వినాయక్‌. అలాంటి ఈ ఇద్దరు ఒక్క చోట చేరి సందడి చేశారు. మెగాస్టార్ ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభరలో నటిస్తు్న్నాడని తెలిసిందే. విశ్వంభర షూటింగ్ దశలో ఉండగా.. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న సెట్స్‌కు వెళ్లాడు వివి వినాయక్‌. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ డైరెక్టర్‌ వశిష్ఠ అండ్ టీం మెంబర్స్‌కు విషెస్‌ తెలియజేశారు.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తుండ‌గా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు.