Friday, October 18, 2024
HomeMovie Newsగోపీచంద్ 'విశ్వం' లేటెస్ట్ అప్డేట్

గోపీచంద్ ‘విశ్వం’ లేటెస్ట్ అప్డేట్

- Advertisement -

ఒక్క సినిమా.. ఇద్దరికి హిట్‌ ఇవ్వాలి.! ఒక్క సినిమా.. ఆ ఇద్దరి కెరీర్లను సెట్‌ చేయాలి.! ఆ ఒక్క సినిమా పేరు.. విశ్వం.! హీరో గోపీచంద్‌కీ, కెప్టెన్‌ శ్రీనువైట్లకి అత్యంత కీలకం.. శ్రీను వైట్ల అంటే అందరికీ కామెడీ గుర్తుకు వస్తుంది. ఆయన తీసిన సినిమాల్లో ప్రేమ, కామెడీ సన్నివేశాలు ఎంతో సహజంగా ఉంటాయి. ఇక గోపీచంద్ అంటే అందరికీ మాస్ యాక్షన్ గుర్తుకు వస్తుంది. అలాంటి ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎలా ఉంటుందా? అని అంతా భావిస్తున్నారు.

చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ‘ద జర్నీ ఆఫ్ విశ్వం’ పేరుతో మరో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. జూలై 31… అంటే ఈ బుధవారం ఉదయం 11.07 గంటలకు ‘ది జర్నీ ఆఫ్ విశ్వం’ విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అని, ఆ వరల్డ్ రేపు చూపిస్తామని చెప్పుకొచ్చారు. ‘విశ్వం’ సినిమాలో గోపీచంద్ సరసన కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. దీని కంటే ముందు రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో ఆవిడ ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read