Saturday, November 23, 2024
Homeతెలుగు వార్తలుఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాశ్ ముఖ్య పాత్రల్లో కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విజన్ 2020. హనీ బన్నీ క్రియేషన్స్, మధు మృద్దు ఎంటర్ టైనేమెంట్స్, శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో కుంట్లూరు వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, మాజీ డిజిపి గోపినాధ్ రెడ్డిలతో పాటు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ట్రైలర్ విడుదల చేసిన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతగా పెరిగిందో , చెడు ప్రభావం కూడా అంతే పెరిగింది. ప్రస్తుతం ప్రతి పిల్లల చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుంది. అందులో వాడు ఏమి చూస్తున్నాడో, ఏమి చేస్తున్నాడో అర్థం పరిస్థితి. సినిమాలు చూసి కొందరు ఈ నేరం చేశాను, ఆ సినిమా చూసి ఈ దొంగతనం   చేసానని చెబుతున్నారు. అయితే సినిమాల్లో నేరాలు చేయడమే కాదు శిక్షలు ఎలా పడతాయో కూడా చూపిస్తే బాగుంటుంది. అప్పుడే ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుందా అన్న భయం కలుగుతుంది. ఇక వెంకటేష్ గౌడ్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయాలనీ అడిగినప్పుడు ఆయనను ఈ కథేమిటి అని అడిగితె కథ గురించి చెప్పారు. చాలా బాగా నచ్చింది నాకు ఆ కథ. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా రావాలి, తప్పకుండా విజన్ 2020 ఈ 2020 ఇయర్ లో మంచి విజయం అందుకోవాలని అన్నారు.

- Advertisement -

సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ .. ప్రస్తుతం  టెక్నాలజీ పెరగడం వల్ల ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది. అయితే టెక్నాలజీ ని ఎంత మంచికి వాడుకుంటున్నారు అనేదానికంటే .. ఎక్కువగా చెడుకే ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఉంటుంది. దానిద్వారా అతను ఎలాంటి సమాచారాన్ని చూస్తున్నాడు, దాన్ని ఎలా వాడుతున్నాడు అన్నది తెలియకుండా పోతుంది. ప్రస్తుతం సమాజంలో నేరాలు బాగా పెరిగాయి. ఈ మధ్య ఎక్కువగా పిల్లలు  స్మార్ట్ ఫోన్ లకు అడిక్ట్ అవుతున్నారు .. అలాగే సోషల్ మీడియా, వాట్స్ అప్ గ్రూప్స్ .. ఇలా దాన్ని ఎందుకు వాడుతున్నారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఈ రోజు సమాజాన్ని, దేశాన్ని బాగుచేయాలంటే అది ఒక్క  పోలీసులవల్లో, ప్రభుత్వం వల్లో కాదు .. ప్రజలందరి వల్లే సాధ్యంఅవుతుంది . ప్రతి ఒక్కరు తమదైన రెస్పాన్స్ తో దేశానికి మనం ఏమి ఇచ్చామని అనుకున్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అన్నారు.

దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ .. ప్రస్తుతం ఇంత రైన్ ఉన్నా కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కు డిపార్ట్మెంట్ వ్యక్తులు రావాలి అన్న ఆలోచనతో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారిని కలిసేందుకు చాలా ప్రయత్నిస్తే ఈ రోజు ఉదయం ఆయన్ను కలవడం జరిగింది. ఇక మాజీ డిజిపి గోపినాధ్ రెడ్డి గారు మా కాలేజీ లో ఐకాన్ అయన. నేను కాలేజీ చదివేటప్పుడు ఆయనే మాకు ఇన్స్పిరేషన్. ఈ సినిమా చేయడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రేరణ. అయన ఓ ఇంటర్వ్యూ లో పెద్ద ఇష్యు గురించి చెప్పారు .. ఆ తరువాత అదే విషయం గురించి కేటీఆర్ గారు చెప్పారు, ఆ తరువాత పవర్ స్టార్ చెప్పారు .. ఇలాంటి పెద్ద వాళ్ళు అందరు ఈ విషయం గురించి చెప్పారంటే ఇదేదో బాగా వర్కవుట్ అవుతుందని ఈ కథను తెరకెక్కించాను. ఇది దిశా సినిమా కాదు .. ఎలాంటి మెసేజ్ కూడా ఇవ్వడం లేదు. అందరికి ఆసక్తి కలిగించే సినిమా ఇది. సినిమా పూర్తయింది దీన్ని ఓటిటి లో విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాం అన్నారు.

నిర్మాత వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ .. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, సజ్జనార్ గారికి, మాజీ డిజిపి గోపినాధ్ గారికి, అలాగే మిగతా ప్రేముకులందరికీ మా ధన్యవాదాలు, బిజినెస్ రంగంలో ఉంటూ .. సినిమాలు చేయాలన్న ఆలోచన కలిగింది. నా మిత్రుడు స్వర్గీయ శ్రీహరి గారు నాకు స్ఫూర్తి సినిమా చేయడానికి, సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశం ఉంది. ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలలో ఒక మెయిన్ సమస్య తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. ఇది నేటి యూత్ ని ఉద్దేశించి చేసిన సినిమా ఇది. ఈ సమాజాన్ని బాగుచేసే క్రమంలో  పాత్ర, ,నా వంతు పాత్ర ఏమిటి ? అన్నది ప్రశ్నించుకునేలా చేస్తుంది అన్నారు.

మరో నిర్మాత రమేష్ రాజు మాట్లాడుతూ ..కరోనా టైం లో ఈ సినిమాను నిర్మించాం. తప్పకుండా ఈ సినిమా అందరికినచ్చేలా ఉంటుంది. ఓ బలమైన అంశాన్ని కథగా ఎన్నుకుని మంచి సినిమా చేయాలని ఆలోచనతో ఈ సినిమా చేసాం అన్నారు.

సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ .. ఇలాంటి మంచి సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకులు కరణం బాబ్జి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ  చిత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేదిగా ఉంటుంది అన్నారు.  

ఈ చిత్రానికి సంగీతం : రాప్ రాక్ షకీల్, ఎడిటింగ్ : ఎస్ బి ఉద్దవ్, ఆర్ట్ : జె కె మూర్తి, కెమెరా : వెంకట్ ప్రసాద్, డాన్స్ : గణేష్, ఫైట్స్ : సిందూరం సతీష్, స్టంట్ వై రవి , ప్రొడక్షన్ మేనేజర్ : రామారావు జాడ్డ , పీఆర్ ఓ : జర్నలిస్ట్ ప్రభు, నిర్మాతలు : కుంట్లూరు వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు, రచన, దర్శకత్వం : కరణం బాబ్జి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read