Movie News

ఫాలోయర్స్ షాక్ ఇచ్చిన విశ్వక్‌ సేన్‌

నటుడు విశ్వక్‌ సేన్‌ సోషల్ మీడియా ఫాలోయర్స్ కు షాక్ ఇచ్చింది. సోషల్​మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో స్పందిస్తూ..అందరి హీరోల అభిమానులను అలరిస్తుంటాడు. హిట్​ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే విశ్వక్​ తనపై వచ్చిన విమర్శలకు, ట్రోల్స్‌కు గట్టిగా రియాక్ట్ అవుతుంటారు. అయితే తాజాగా విశ్వక్‌ ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్ అయినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి అకౌంట్ డిలీట్ అవ్వక ముందు తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టారు విశ్వక్​. సోషల్​మీడియా నుంచి దూరమవుతున్నట్లు అందులో రాసి ఉంది. దీంతో కొన్ని రోజుల వరకు పోస్ట్‌లు పెట్టరేమో అని అంతా భావించారు. కానీ ఇప్పుడు అసలు ఇన్‌స్టాలో అకౌంటే కనిపించకపోవడంతో కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. అయితే ఇటీవలే యూట్యూబ్‌, సోషల్‌ మీడియాల్లో నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చేవారిపై విశ్వక్‌ ఫైర్‌ అయ్యారు. ఓ యూట్యూబర్‌ కల్కి రిలీజ్‌ కాకముందే రివ్యూ ఇవ్వడంపై మండిపడ్డారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అయన సోషల్ మీడియా కు దూరం అయ్యారని అంటున్నారు.