విజయవాడలో రామ్ చరణ్ అభిమానులు గర్వపడే అద్భుత కట్ ఔట్‌ను సిద్ధం చేశారు. వజ్ర గ్రౌండ్‌లో 256 అడుగుల భారీ కట్ ఔట్ ఏర్పాట్లతో నగరాన్ని అలంకరించారు. ఈ కట్ ఔట్ ని అభిమానులు ఎంతో వేడుకగా ఆరాధిస్తున్నారు.
కట్ ఔట్ ప్రారంభం:ఈరోజు సాయంత్రం 3.30 నుంచి 4 గంటల మధ్య ‘గేమ్ ఛేంజర్’ సినిమా బృందం ఈ భారీ కట్ ఔట్‌ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ మరియు సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం.ఈ కారిక్రమానికి సినిమా బృందం భారీ ఏర్పాట్లు చేసింది.1500 నుంచి 2000 మంది అభిమానులు కట్ ఔట్ ప్రారంభానికి అనుమతిని పొందారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, ప్రాంగణంలో పకడ్బందీగా అన్ని చర్యలు చేపట్టారు.
పూల వర్షం:రామ్ చరణ్ కట్ ఔట్ ప్రారంభం సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ ప్రత్యేక సన్నివేశం ప్రేక్షకుల్ని మరింత అలరిస్తుంది.
దేశంలోనే అత్యంత భారీ కట్ ఔట్:ఈ కట్ ఔట్ భారతదేశంలోనే అత్యంత భారీ కట్ ఔట్‌గా నిలిచింది. విజయవాడ నగరంలో ఉన్న ఈ 256 అడుగుల కట్ ఔట్ రామ్ చరణ్ అభిమానులకు ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోంది.
అభిమానుల రద్దీ:ఇప్పటి నుంచే భారీ సంఖ్యలో అభిమానులు వజ్ర గ్రౌండ్‌కి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం అద్భుతమైన సందడిని సృష్టిస్తోంది.రామ్ చరణ్ ఫ్యాన్స్ మరొకసారి ఆయనకున్న ప్రేమను అద్భుతంగా ప్రకటిస్తూ ఈ భారీ కట్ ఔట్‌ను ఘనంగా ప్రారంభిస్తారు.