Movie News

డేటింగ్ రూమర్స్​పై విజయ్ దేవర కొండ క్లారిటీ

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్రేమ మరియు డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తూవస్తున్నాడు. ఇటీవల ఆయనపై జోరుగా ప్రచారం జరుగుతున్న డేటింగ్ రూమర్స్‌పై స్పందించారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్.. సమయం వచ్చినప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటానని తెలిపారు. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలపై ఆసక్తి చూపడం సహజమన్నారు. “అన్ లిమిటెడ్ లవ్ గురించి నాకు తెలియదు. ఒకవేళ ప్రేమ ఉంటే దానితోపాటు బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా చాలా ప్రేమిస్తే, దాని నొప్పిని కూడా మళ్లీ చవిచూసే అవకాశం ఉంటుంది” అని , ప్రేమ మరియు బాధపై ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

విజయ్ దేవరకొండ పెళ్లి గురించి వచ్చిన ప్రచారాలను కూడా ఖండించారు. ఈ ఏడాది ప్రారంభంలో తన వివాహం గురించి వచ్చిన వార్తలపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది తన పెళ్లి వార్తలు చక్కర్లు కొడతాయని, ఆ వార్తలపై స్పందించడంలో తనకు ఇబ్బంది లేదు అని అన్నారు. ప్రస్తుతం తన ‘VD12’ చిత్రంలో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.