Monday, December 23, 2024
HomeMovie Newsవిజయ్ దేవరకొండ కు జోడిగా సాయి పల్లవి..?

విజయ్ దేవరకొండ కు జోడిగా సాయి పల్లవి..?

- Advertisement -

సాయి పల్లవి మళ్లీ బిజీ గా మారింది. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..తెలుగు లోకూడా వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే నాగ చైతన్య సరసన తండేల్ మూవీ చేస్తుంది. ఈ సినిమా ఫై అందరిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటె తాజాగా ఈ భామ విజయ్ దేవరకొండ సరసన జోడి కట్టేందుకు సిద్ధం అయినట్లు వినికిడి.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ‘రాజావారు రాణీగారు’ తో ఆక‌ట్టుకొన్న ర‌వికిర‌ణ్ కోలా ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తుండగా.. విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. రూర‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ‘రౌడీ జ‌నార్థ‌న్‌’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌విని హీరోయిన్ గా ఎంచుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ద‌ర్శ‌కుడు సాయిప‌ల్ల‌విని దృష్టిలో ఉంచుకొనే హీరోయిన్ పాత్ర‌ని డిజైన్ చేశాడ‌ట‌. క‌థానాయిక పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంద‌ని, ఆ పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి అయితేనే న్యాయం చేస్తుంద‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read