Movie News

విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ ఇమేనా..?

పెళ్లి చూపులు , గీత గోవిందం, అర్జున్ రెడ్డి మూవీస్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించి యూత్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ..ఆ తరువాత నుండి వరుస ప్లాప్స్ చవిచూస్తున్నాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన చిత్రాలని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ అవుతున్నాయి. రీసెంట్ గా పరుశురాం డైరెక్షన్లో ‘ఫ్యామిలీ స్టార్ ‘ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో ప్లాప్ చవిచూశాడు. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరి మూవీ పైనే ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రవి కిరణ్ కోలా అనే యంగ్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ ఈమె అంటూ ఓ ఫోటో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న యాక్టర్.. ఆయన గురించి నిత్యం వార్తల్లో ఏదొకటి వైరల్ అవుతుంది.. అలాగే తాజాగా ఓ ప్రైవేట్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.. ఆ ఫోటోలు కాస్త క్లోజ్ గా ఉండటంతో నెట్టింట దుమారం రేపుతున్నాయి. విజయ్ దేవరకొండ ,అతని మాజీ ప్రియురాలి సన్నిహిత ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. యూరోపియన్ కు చెందిన వర్జిన్ అనే యువతితో విజయ్ దిగిన ఫోటో అది. ఆ ఫోటోలు చూస్తే నిజంగానే వీరిద్దరి మధ్య మ్యాటర్ నడుస్తుందనే తెలుస్తుంది. ఇక ఆ ఫొటోస్ లలో విజయ్ నవ్వుతూ కనిపించగా , వర్జిన్ అతన్ని గట్టిగ కౌలిగించుకొని ముద్దు పెడుతున్నట్లు కనిపిస్తుంది.