రౌడీ స్టార్ ఎమోషనల్

రౌడీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో సతమతం అవుతున్న విజయ్..ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా తన ఫ్యామిలీ తో కలిసి అమెరికా కు వెళ్లి తిరిగొచ్చాడు. తాజాగా విజయ్ దేవరకొండ అమెరికాలో తన పేరెంట్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా అమ్మానాన్నలను మొదటిసారి అమెరికాకు తీసుకెళ్ళాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. విజయ్ అమ్మానాన్నలను మొదటిసారి అమెరికా తీసుకెళ్లడంపై తన పేరెంట్స్ ని ఎంత బాగా చూసుకుంటున్నాడో అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఓ డైరెక్టర్ వల్ల హర్ట్ అయ్యాడని అప్పట్లో ఓ రూమర్ తెగ వైరల్ అయింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రవిబాబు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వూలో రవిబాబును అడిగితే… హర్ట్ అయ్యాడన్న విషయం తనకు తెలియని.. నువ్విలా తర్వాత కూడా తనతో కలిసి రెండు, మూడు యాడ్స్ కూడా చేశాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అవును2 సినిమాలో ముందుగా హర్షవర్దన్ రోల్‌కు కూడా తననే అనుకున్నానని, కాకపోతే తన కాంటాక్ట్ ఎక్కడ దొరకలేదని దాంతో హర్షవర్ధన్‌ను తీసుకున్నాని చెప్పాడు.

దీంతో విజయ్ హర్ట్ అవ్వలేదని.. అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ… గౌతమ్ తిన్ననూరితో ఓ పోలీస్ యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార సంస్థ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నాడు. ముందుగా శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నారు కానీ.. పలు కారణాల వల్ల ఆ బ్యూటీ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం హీరోయిన్ వేటలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తుంది.