ప్రభాస్ నటించిన కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. గురువారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె సహా స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ చిత్రానికి సౌత్ టూ నార్త్ ఎక్కడ చూసినా కల్కి హవాయే కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడి పాత్రపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. అర్జునుడిగా విజయ్ సూటవ్వలేదంటూ నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ సరిగ్గా సరిపోయాడంటూ చెబుతున్నారు. అయితే తనపై వస్తున్న ట్రోల్స్‌కి విజయ్ దేవరకొండ ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు.
“కల్కి 2898 ఏడీ సినిమా ఇప్పుడే చూశా. చూస్తున్నంత సేపు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఖచ్చితంగా ఇండియన్ సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఇందులో అర్జునుడిగా కనిపించడం, ఆ పాత్ర చేయడం నాకు ఆనందంగా ఉంది. నాగి, ప్రభాస్ అన్న గురించే ఈ కేమియో చేశాను. వాళ్లంటే నాకు చాలా ఇష్టం. అయితే చాలామంది ప్రభాస్‌ను సవాల్ చేసే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించాడని అంటున్నారు. కానీ తెరపై విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నట్లుగా మీరు చూడొద్దు. నన్ను అర్జునుడిగా.. ఆయనను కర్ణుడిగా మాత్రమే చూడాలి. నాగీ యూనివర్స్‌లో మేము పాత్రలు చేస్తున్నాం అంతే. నాగి ప్రతి సినిమాలో నేను చేయడం అలవాటు అయిపోయింది. తనకి నేను లక్కీఛార్మ్ అని చెప్పొచ్చు. కానీ సినిమాలు బాగున్నాయి కాబట్టి అవి నడుస్తున్నాయి. నేను చేయడం వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి అనడం కరెక్ట్ కాదు. మహానటి, కల్కి రెండూ తను తీసిన గొప్ప సినిమాలు.” అంటూ విజయ్ తెలిపాడు.
అలాగే కల్కి పార్ట్ 2పై తన రోల్ గురించి ప్రశ్నించగా తెలివిగా సమాధానమిచ్చారు. కల్కి పార్ట్-2లో మీ పాత్ర ఇంకాస్త ఎక్కువ ఉంటుందని నిర్మాత అశ్వినీదత్ చెప్పారు.. మీరేమంటారు.. అని రిపోర్టర్లు ప్రశ్నించారు. దీనికి “ఆయన ఏది చెబితే అది కరెక్ట్.. మరి నన్ను అడగడం ఎందుకు” అంటూ విజయ్ దేవరకొండ ఆన్సర్ ఇచ్చారు.