Tuesday, December 24, 2024
HomeMovie Newsవావ్..ఒకే ఫ్రెమ్ లో అందరు..ఎంతబాగున్నారో..!!

వావ్..ఒకే ఫ్రెమ్ లో అందరు..ఎంతబాగున్నారో..!!

- Advertisement -

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ పెళ్లి వేడుక ఇటీవలే ముంబై లో ఎంతో గ్రాండ్​గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ఇలా అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..అయ్యాయి కూడా..అయితే తాజాగా ఓ ఫొటో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్​ను షేక్​ చేస్తోంది. ఇంతకీ ఆ ఫోటో లో ఏమున్నదనే కదా..

ఆ ఫోటో లో సూపర్ స్టార్ మహేశ్‌బాబు, సూర్య, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇలా టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్​ ఉన్నారు. ‘మంచి మనసు ఉన్న వ్యక్తులతో అందమైన క్షణాలు’ అంటూ అనంత్‌, రాధిక పెళ్లి వేడుకల్లో భాగంగా దిగిన ఆ ఫొటోను కోలీవుడ్ డైరెక్టర్, నయనతార భర్త విఘ్నేశ్​ శివన్ తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు. అలాగే ఈ ఫొటోలో విఘ్నేశ్‌ శివన్‌ – నయనతార, సూర్య- జ్యోతిక, మహేశ్‌బాబు – నమ్రత, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ – సుప్రియ దంపతులు ఉన్నారు. వీరితో పాటు జెనీలియా, అఖిల్‌, సితార అలాగే క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా దంపతులు కూడా కనిపించారు. ఈ ఫోటో చూసి అందరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ షేర్ చేస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read