Monday, December 23, 2024
HomeMovie Newsఅజిత్ ‘విడాముయ‌ర్చి’ లేటెస్ట్ అప్డేట్

అజిత్ ‘విడాముయ‌ర్చి’ లేటెస్ట్ అప్డేట్

- Advertisement -

తమి హీరో అజిత్‌కుమార్ , లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ఈ సినిమా ఫై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభం నుంచే అంద‌రి దృష్టి ఈ సినిమాపై ఉంది. త‌న‌ కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించ‌గా .. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు క‌లిసి ఈ మూవీలో న‌టిస్తుండ‌డం విశేషం. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు చిత్రయూనిట్ అందరూ కలిసి ఫోటోకు పోజిచ్చారు. షూటింగ్‌ను పూర్తి చేసిన ఆనందం వారి కళ్లల్లో కనిపిస్తోంది. ఎంతో సరదాగా షూటింగ్‌ను ఫినిష్ చేశారని అర్థం అవుతోంది. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. కాగా సినిమాను దీపావ‌ళికి ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకువ‌చ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read