Friday, October 18, 2024
HomeMovie Newsబిగ్ బాస్ 8 లో కాంట్రవర్శీ స్వామిజీ…?

బిగ్ బాస్ 8 లో కాంట్రవర్శీ స్వామిజీ…?

- Advertisement -

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ విజయవంతంగా రన్ అవుతున్న షో బిగ్ బాస్. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు నడిచే ఈ రియాల్టీ షో గురించి నిత్యం ఏదోక న్యూస్ నెట్టింట వైరలవుతుంటుంది. ఇక ఇందులోకి ఎంటరయ్యే పోటీదారుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. హిందీలో ప్రస్తుతం బిగ్‏బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుండగా.. త్వరలోనే తెలుగులో సీజన్ 8 స్టార్ట్ కానుంది.

ఈసారి ఈ షోను కాస్త ముందుగానే ప్రారంభించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 4న బిగ్‏బాస్ సీజన్8 స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అలాగే ఈసారి షోలో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కుమారి ఆంటీతోపాటు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క, అమృత ప్రణయ్, అలాగే యూట్యూబర్ నేత్ర, మోటివేషనల్ స్పికర్ వంశీ తో పాటు వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఎంట్రీ ఇస్తున్నాడట. ఇందుకోసం ఆయనకు లక్షల్లోనే ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇదే నిజమైతే ఈ సీజన్ కూడా సక్సెస్ అయినట్లే అని చెప్పాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read