వెంకీ అట్లూరి టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన కథనాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ‘సార్’ సినిమా విజయంతో ఆయన ప్రతిభను మరింత సుస్థిరం చేసుకున్నారు. ధనుష్‌తో కలిసి చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని వెంకీ అట్లూరి ఇటీవల పంచుకున్నారు.
అతని మాటల్లో: “సార్ సినిమాకు కథను చెప్పినప్పుడు చాలా మంది టాప్ హీరోలు దాన్ని తిరస్కరించారు. కారణం క్లైమాక్స్. కొంతమంది ప్రముఖ నటులు క్లైమాక్స్‌లో మార్పులు చేయాలని సూచించారు. అయితే నేను రాజీ పడలేదు. నాకి కథకు న్యాయం చేయడం ముఖ్యం, అందుకే నేను మార్పులు చేయడానికీ ఒప్పుకోలేదు.”
ఇలాంటి పరిస్థితుల్లో ధనుష్‌ను సంప్రదించిన వెంకీ అట్లూరి, కథను వివరించిన వెంటనే ధనుష్ పాత్రకు ఒకే చెప్పడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా, ధనుష్ కథను అర్థం చేసుకుని, యూనిక్ ఎండింగ్‌ను సమర్థించడంతో సినిమా సార్ధకత పెరిగిందన్నారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకోవడంతో పాటు, నిర్మాతలకు మంచి లాభాలను తీసుకొచ్చింది. వెంకీ అట్లూరి ‘సార్’ విజయంతో ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆస్వాదిస్తారని మరోసారి నిరూపించాడు.