Movie News

వెంకటేష్ – మంచు మనోజ్ కలయికలో మూవీ..?

సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు తదితర హీరోల తో మల్టీస్టారర్ మూవీ చేయగా..ఇప్పుడు మంచు మనోజ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ మధ్య కాలంలో వెంకటేష్ సినిమాలు చేయడం బాగా తగ్గించారు. గత సంక్రాంతికి ‘సైంధవ్’ అనే సినిమాతో వచ్చారు. కానీ, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఎఫ్ 2 ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ను సైతం ఫైనల్ చేసుకున్నారు.

ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్‌ను జూన్ లేదా జూలై నుంచి స్టార్ట్ చేస్తారట. అంతేకాదు, వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మూవీ లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసారు. ఇక ఈ మూవీ లో వెంకటేష్ తో పాటు మంచు మనోజ్ కూడా నటించబోతున్నట్లు తాజా వార్త. అతడి పాత్ర గతంలో ఎన్నడూ చూడని వేరియేషన్స్‌తో ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఇందులో మంచు మనోజ్ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తాడని టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది చూడాలి. ప్రస్తుతం మనోజ్ గత కొంతకాలంగా సినిమాలు చేయడం మానేశారు. ఇక ఇప్పుడు వెంకీ తో కలిసి రాబోతున్నాడని అంటున్నారు.