Movie News

మన చిన్న సాయం చిన్నారులకు పెద్ద సంతోషాన్ని ఇస్తుంది

”రేపు నా బర్త్ డే. ఈ చిన్నారులతో కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా వంతుగా డొనేషన్ ఇచ్చాం. ఇది చిన్నదే. అయితే ఈ చిన్న సాయం కూడా వారికి పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. అందరూ కలసి ఈ చిన్నారులకు హెల్ప్ చేయండి’అన్నారు హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్.

రేపు(మార్చి5) వరలక్ష్మీ శరత్ కుమార్ బర్త్ డే. ఈ సందర్భంగా కుటుంబంతో కలసి హైదరాబాద్ లోని లెప్రా సొసైటీ ఆర్ఫానేజ్ కి వెళ్లి చిన్నారులతో సమయాన్ని గడిపి, వారికి గిఫ్ట్స్ అందించారు. అనంతరం భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ తో కలసి ఆర్ఫనేజ్ కి డొనేషన్ అందజేశారు.

ఈ సందర్భంగా హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా ప్రతి బర్త్ డే కి నావంతు సాయంగా సోషల్ సర్విస్ చేస్తాను. చెన్నై నుంచి మొత్తంగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఈసారి హైదరాబాద్ లో ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని అనుకున్నాను. ఈ ఆర్ఫనేజ్ లో చాలామంది ఆడబిడ్డలు వున్నారు. ఈ బ్రాంచ్ లో 62 మంది చిన్నారులు వున్నారు. వాళ్ళ కోసం మన తరపున చిన్న సాయం చేయొచ్చు. చాలా మందికి ఈ ఆర్ఫనేజ్ గురించి తెలీదు. సెలబ్రిటీ వస్తే ఆర్ఫనేజ్ కి ఒక గుర్తింపు వస్తుందని ఆశ, దీని గురించి జనాలుకి తెలుస్తుందనే మంచి ఉద్దేశంతో వచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు. మీడియా సపోర్ట్ వలన ఈ ఆర్ఫనేజ్ గురించి జనాలకు తెలుస్తుంది. దయచేసి అందరూ హెల్పింగ్ హ్యాండ్స్ అందించండి. గౌతం గారికి థాంక్ యూ.


వరలక్ష్మీ శరత్ కుమార్ భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ మాట్లాడుతూ… జీవితం అందరికీ ఒకేలా వుండదు. మేము చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు మేమున్న పరిస్థితిలో ఈ సాయం చేయడం పెద్ద డీల్ కాకపోవచ్చు. సాయం చేయడం మా బాధ్యత. ఇక్కడ చిన్నారులని కలసిన తర్వాత చాలా ఎమోషనల్ గా అనిపించింది. మన దగ్గర వున్నదాంట్లో కొంత  ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది. మనకి వున్న దాంట్లో సాయం చేస్తే ఈ ప్రపంచం మళ్ళీ మనకి సాయ పడుతుంది. ఇక్కడికి మళ్ళీ ఆరు నెలల తర్వాత వస్తాం. మీడియాకి, అందరికీ థాంక్ యూ’అన్నారు.