Movie News

Review : ఉపేంద్ర ‘యూ & ఐ’ (UI)

బ్యాన‌ర్‌: ల‌హ‌రి ఫిలింస్‌, వీన‌స్ ఎంట‌ర్టైన‌ర్స్‌
టైటిల్‌: UI
న‌టీన‌టులు: ఉపేంద్ర‌, రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ: హెచ్‌సీ. వేణు
ఫైట్స్‌: థ్రిల్ల‌ర్ మంజు, ర‌వివ‌ర్మ‌, చేత‌న్ డిసౌజా
ఎడిటింగ్‌: విజ‌య్ రాజ్‌
మ్యూజిక్‌: అజ‌నీష్ లోక‌నాథ్‌
నిర్మాత‌లు: జీ మ‌న్మోహ‌న్‌, శ్రీకాంత్ కేపీ
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: ఉపేంద్ర‌
సెన్సార్ రిపోర్ట్ : U / A
ర‌న్ టైం: 130 నిమిషాలు
రిలీజ్ డేట్ : 20 డిసెంబ‌ర్‌, 2024

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘ యూఐ ’ ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచింది. సినిమా తాలూకా టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తి నింపగా.. దాదాపు 10 ఇయర్స్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఉపేంద్ర న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వహించడం తో ‘యూఐ’ అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ఉపేంద్ర తెలుగులోనూ ప్ర‌మోష‌న్లతో సినిమాను మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీతా సంస్థ రిలీజ్ చేయడం విశేషం. ఈ రోజు పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యూఐ సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులు ఏమంటున్నారు..? అనేది చూద్దాం.

తమిళ నటుడు, దర్శకుడు ఉపేంద్ర తన కొత్త చిత్రం ‘యూ & ఐ’ (UI) తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా ఆడియెన్స్ ఇంటెలిజెన్స్‌ను టెస్ట్ చేసే ప్రయోగం అని ఉపేంద్ర ప్రమోషన్స్‌లో వెల్లడించారు. ఈ సినిమా క్లైమాక్స్, ఎండింగ్ షాట్‌ను డీ కోడ్ చేయాలని, అవి చేయలేనివారికి సవాల్ విసిరాడు. మొదటి నుంచి సినిమాను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ, “మీరు ఇంటెలిజెంట్‌గా భావిస్తే ఈ సినిమా చూడకండి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది సినిమాపై మరింత ఉత్కంఠను పెంచింది.

పగలు, రాత్రి’ సత్య(ఉపేంద్ర) వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా కథా నేపధ్యాన్ని ఎంచుకున్నాడు ఉపేంద్ర. 2040లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే సరికొత్త కథాంశంతో ఎవరు ఊహించని నేరేషన్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు ఉపేంద్ర. అటు హీరోగా, ఇటు దర్శకుడుగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించారు. తన డిఫరెంట్ టేకింగ్‌తో వింటేజ్ ఉపేంద్రని గుర్తు చేశాడు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న రాజకీయాలపై తనదై శైలీలో తన మార్క్ డైలాగ్స్ తో సెటైర్లు వేసాడు ఉపేంద్ర. ‘UI’ అంటే ఉపేంద్ర ఇంటెలిజెన్స్ అని, యూనివర్సల్ ఇంటెలిజెన్స్, ‘యూ అండ్ ఐ’ అని ఇలా ఎవరికీ నచ్చిన విధంగా వాళ్ళు అనుకోండి అని ప్రేక్షకులకు వదిలేసాడు. ఈ సినిమాలో కల్కి అవతారంగా ఉపేంద్ర నటన సినిమాకే హైలెట్ అని చెప్పాలి. కాంతారా సంగీత దర్శకుడి అజనీష్ లోకానాధ్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు. సినిమాను ఆసాంతం ఒక ఫిక్షనల్ వరల్డ్ లోకి తీసుకువెళ్లి కాస్త బుర్రక పదును పెట్టి, చివరికి ఊహించని విధంగా ప్రేక్షకులలో మెదడులలోనే అనేక ప్రశ్నలు రేకెత్తించే విధంగా ముగించడం ఉపేంద్ర మార్క్ అని చెప్పొచ్చు..

సోషల్ మీడియా టాక్

‘యూ & ఐ’ సినిమా గురించి ప్రముఖ ప్రేక్షకులు, ట్విట్టర్లో తెలిపిన దాని ప్రకారం, ఈ చిత్రం ఉపేంద్ర యొక్క వన్ మేన్ షోలా సాగిందని పేర్కొంటున్నారు. పగలు-రాత్రి, కల్కి భగవాన్ వర్సెస్ సత్య వంటి అంశాలతో సినిమాను విశేషంగా రూపొందించారు. “వింటేజ్ ఉపేంద్ర బ్యాక్” అని చెప్పుకుంటున్నారు. ఎలాంటి ఇతర డైరెక్టర్ల కంటే అతను డిఫరెంట్ గా ఈ చిత్రాన్ని రూపొందించాడని కామెంట్లు వస్తున్నాయి. సినిమా శైలిలో అనేక కొత్త ప్రయోగాలు చేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా టేకింగ్ మరియు మేకింగ్‌లో ఉపేంద్ర ఏమాత్రం తడబడ్డట్లు కనిపించడం లేదు. అతను ఆడియెన్స్‌ను కన్ఫ్యూజ్ చేయడం, అసలు ఏమి జరుగుతుందో అంచనా వేసుకోకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లడం కచ్చితంగా ఆయన ప్రత్యేకత అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ సినిమా అనేది డీప్ ఇంటెలెక్చువల్ మీనింగ్ కలిగిన చిత్రం అని, సినిమాటిక్ యాత్రకు నూతన దారులు చూపించాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నట్టుగా ఈ సినిమా ఉంది అని కామెంట్లు వస్తున్నాయి. ‘యూ & ఐ’ సినిమా సాధించబోయే విజయంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఉపేంద్రకు ఉన్న గొప్ప జ్ఞానం, క్రమంగా తన శైలిని ప్రపంచానికి పరిచయం చేసినట్టు ఇది కనిపిస్తోంది. “డైరెక్టర్‌గా ఉపేంద్ర ది బెస్ట్” అని ఆయనను పొగడుతున్నారు. ‘యూ & ఐ’ సినిమా పై ప్రేక్షకులు, విశ్లేషకులు కేవలం ప్రశంసలు కురిపిస్తూ, ఉపేంద్రను అనేక తరహాల్లో ప్రశంసిస్తున్నారు.