టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శించడంపై వస్తున్న విమర్శలకు ఆయన భార్య ఉపాసన కొణిదెల సమర్థవంతంగా స్పందించారు. ఉపాసన, తన పోస్ట్ ద్వారా, భారతీయ సంస్కృతిలో మత పరమైన ఐక్యతకు ప్రాధాన్యతను వివరించారు. రామ్ చరణ్ దైవభక్తికి కట్టుబడి అన్ని మతాల్ని గౌరవిస్తారని స్పష్టం చేశారు.
ఇదే సందర్బంగా నెటిజన్ చేసి ట్వీట్ కు కూడా రిప్లయ్ ఇచ్చింది. శబరిమల ప్రత్యేక సంప్రదాయాలకు సంబంధించి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనాన్ని గుర్తుచేసి, “మసీదులో ప్రార్థనలు చేయడం శబరిమల సంప్రదాయాల్లో భాగం” అని చెప్పుకొచ్చారు. ‘‘విశ్వాసం ఒక్కటి చేస్తుంది.. అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి. ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారు’’ అని రాసుకొచ్చారు.
Faith unites, never divides
As Indians, we honor all paths to the divine 🙏 our strength lies in unity. 🇮🇳 #OneNationOneSpirit #jaihind @AlwaysRamCharan respecting other religions while following his own 🫡 pic.twitter.com/BdW58IEEF9— Upasana Konidela (@upasanakonidela) November 19, 2024