తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్‌తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరోపై నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదు అయ్యింది. రాజ్‌తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఏ 1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాన్ని చేర్చుతూ నార్సింగ్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. తనను చంపేస్తామని బెదిరించి భయబ్రాంతులకు గురి చేసిన మాల్వితో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో ఎప్‌ఐఆర్‌లో ముగ్గురి పేర్లను పోలీసులు చేర్చారు. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద ముగ్గురిపైనా కేసు నమోదు అయ్యింది. ఇక ఈ కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతుండడం..కేసులో రాజ్ తరుణ్ దే తప్పని నిజాలు బయటపడుతుండడం తో రాజ్ తరుణ్ ఇంటి నుండి బయటకు రాలేకపోతున్నారు. కనీసం ఆయన నటించిన సినిమాల ప్రమోషన్ కు కూడా రాలేని పరిస్థితి వచ్చింది.
ఈయన నటించిన సినిమాలు రెండు తిరగబడరా సామి, పురుషోత్తముడు సినిమాలు కేవలం ఒక్కవారం గ్యాప్ లోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాల గురించి జనాలకు తెలియాలంటే హీరో ఖచ్చితంగా మీడియాతో మాట్లాడాలి.. కానీ ఎక్కడ బయటకు వచ్చినట్లు కనిపించలేదు..రాజ్ తరుణ్ కు మొత్తంగా చూసుకుంటే లైఫ్ అండ్ డెత్ గా మారింది.. చాలా కాలంగా సరైన సినిమా లేక ఖాళీగా ఉన్న రాజ్‌తరుణ్‌కి ఇది చాలా కీలకమైన సమయం. ఈ రెండు సినిమాల విజయాన్ని బట్టే అతని కెరీర్, హీరోగా మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు లావణ్య పెట్టిన కేసులతో అతని సినీ కేరీర్ ఎండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.. మొన్న రాజ్ తరుణ్ హీరోగా చేసిన పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఓ హోటెల్ లో జరిగింది. ఈ కార్యక్రమం హీరో లేకుండానే జరిగింది. ఇంటర్వ్యూలోనూ రాజ్ తరుణ్ దర్శనం లేదు.. నిర్మాతలు పెద్దగా మాట్లాడలేదు. లావణ్య అతని పై కేసు పెట్టిన తర్వాత ఒకసారి మీడియా ముందుకు వచ్చి నేను తప్పుచెయ్యలేదని చెప్పాడు.. ఆ తర్వాత తన ఫ్రెండ్ శేఖర్ భాష రాజ్ తరుణ్ కు సపోర్ట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు.. ఇప్పుడు సినిమాల కోసం కూడా బయటకు రాకపోవడం తో రాజ్ తరుణ్ నిజంగానే తప్పు చేశాడా? ఆ ఎఫైర్స్ కూడా ఉన్నాయా? తప్పు చెయ్యకుంటే ఎందుకు అతను సినిమా ఈవెంట్స్ హాజరు కాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.