చిత్రసీమలో రాణించిన వారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణించడం అనేది కొత్త కాదు..ఇది అన్ని ఇండస్ట్రీ లలో జరుగుతూ వస్తుందే. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కళ్యాణ్..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించి నేడు..ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇదిలా ఉంటె తమిళ్ చిత్రసీమలోను అగ్ర హీరో విజయ్ కూడా తమిళగ వెట్రి కళగం అనే పొలిటికల్ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ పార్టీ లో చేరేందుకు అగ్ర హీరోలు ఆసక్తి కనపరుస్తునట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాఘవ లారెన్స్, కేపీవై బాలాలు ఇపుడు విజయ్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంపై టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ వారిద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరే కాదు.. మరికొందరు నటీనటులు కూడా విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనేలా కోలీవుడ్ మీడియాలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ పూర్తి స్థాయిలో పొలిటికల్ బాట పట్టినప్పుడు వారంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విజయ్ తను అంగీకరించిన సినిమాలను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.