Monday, December 23, 2024
HomeMovie Newsదేవర సాంగ్ ఫై ట్రోల్స్ …

దేవర సాంగ్ ఫై ట్రోల్స్ …

- Advertisement -

దేవర నుండి వచ్చిన సెకండ్ సాంగ్ ఫై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27 రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్ తో దేవర సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ సాంగ్ మాత్రమే రిలీజయింది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ “చుట్టమల్లే” అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను నిన్న రిలీజ్ చేశారు. బీచ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్-జాన్వీపై తీసిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్-జాన్వీ రొమాన్స్, కెమిస్ట్రీ వేరే లెవల్లో ఉంది. నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ పాటను తెగ లైక్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా సాంగ్ రిలీజైందో లేదో అలా కొన్ని వందల అకౌంట్ల నుంచి ఈ పాటపై ట్రోల్స్ దర్శనమిచ్చాయి.

చుట్టమల్లే పాటను వింటుంటే.. చాలా మందికి చాలా పాటలు గుర్తుకు వస్తున్నాయి. ఇందులో చాలా మందికి శ్రీలంక సెన్సేషన్ సాంగ్ గుర్తుకు వస్తోంది. మానికే మాగే హితే అనే పాటను కాపీ కొట్టి అనిరుధ్ ఈ చుట్టమల్లేని కంపోజ్ చేశాడని ట్రోలింగ్ చేస్తున్నారు. సేమ్ టు సేమ్ ఉంది కదా అని ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. “చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీలోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపు..” అంటూ సాగే ఈ పాట మత్తెక్కించేలా ఉంది. ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా సింపుల్‌గా వినసొంపుగా ఉన్నాయి. అయితే ఈ పాట ట్యూన్ ఫేమస్ శ్రీలంక సాంగ్‌లా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది సబ్బుల యాడ్‌లా ఉందంటూ రెక్సోనా, సింథాల్, లిరిల్ సోప్ యాడ్స్‌తో మిక్స్ చేసి వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పోస్టులు చేస్తున్న వారిని ఏకిపారేస్తున్నారు.

🌚🌚 #Devara #Devara‌SecondSingle pic.twitter.com/fewdOdaoJt— Hyderabad Hawaaa (@tweetsraww) August 5, 2024

New Liril Soap Advertisement#JrNTR #JahnviKapoor pic.twitter.com/qP084UO7u2— Gautam㊗️ (@gowthamcinemas) August 5, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read