Movie News

త్రినాథ్ రావు డైరెక్షన్లో గోపీచంద్..?

సీనియర్ హీరో గోపీచంద్ సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదు. సినిమా ఛాన్సులు బాగా తగ్గాయి. ఒకవేళ వచ్చిన కూడా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదించలేకపోతుంది. ఈ క్రమంలో క్రేజీ డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ధమాకా’ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు త్రినాథ్ రావు నక్కిన . అంతకు ముందుకు అతను తీసిన సినిమాలు కూడా బాగానే ఆడాయి.

‘మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్’ అనే నమ్మకం అతనిపై ఉంది. అయితే ‘ధమాకా’ తర్వాత టాప్ లీగ్లోకి చేరుకుంటాడు అని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు పెద్ద హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. మిడ్ రేంజ్ హీరోలు కూడా రెండేసి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. దీంతో గోపీచంద్ తో తన నెక్స్ట్ మూవీ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుందిభగవాన్ – పుల్లారావు..ల నిర్మాణంలో త్రినాథ్ రావ్ నక్కిన సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు.గోపీచంద్ డేట్స్ వాళ్ళ వద్ద ఉన్నాయి. అందువల్ల ఈ కాంబో సెట్ అయినట్లు తెలుస్తుంది. బెజవాడ ప్రసన్న కుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రినాథ్ రావ్ నక్కినకి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. గోపీచంద్ కి మాస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఈ కాంబో సెట్ అయితే.. మంచి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.