Movie News

బికినీ లో త్రిదా చౌద‌రి..అబ్బా అనకుండా ఉండలేరు

చిత్రసీమలో రాణించాలన్న..ఛాన్సులు రావాలన్న కేవలం నటన మాత్రమే ఉంటె సరిపోదు..గ్లామర్ కూడా అదే రేంజ్ లో ఉండాలి..అంతే కాదు ఆ అందాన్ని బయటకు కూడా అలాగే చూపించాలి అప్పుడే వరుస ఛాన్సులు తలుపుతడతాయి. అందుకే చిన్న హీరోయిన్ల దగ్గరి నుండి పెద్ద హీరోయిన్ల వరకు బికినీ ఫోటో షూట్ లతో అలరిస్తుంటారు. తాజాగా త్రిదా చౌద‌రి కూడా ఆలాగే సెగలు రేపుతోంది. చేతిలో సినిమాలు లేక‌పోయినా ఇన్ స్టాలో ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ ఉన్నారంటే ఇది ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్న‌ది తెలిసిందే. తాజాగా అమ్మ‌డు ప‌ర్పెక్ట్ బీచ్ వేర్ లో త‌ళుకులీనిన వైనం ఆహా అనిపిస్తుందంటే అతిశ‌యోక్తి కాదు. రిసార్స్ట్ లో అమ్మ‌డు ఇలా రిలాక్స్ అవుతోంది. వైట్ అండ్ గ్రీన్ కాంబినేష్ స్విమ్ షూట్ త్రిద స్కిన్ టోన్ కి ప‌ర్పెక్ట్ గా సెట్ అయ్యింది.

ఇందులో త్రిదా చౌద‌రి నేచుల‌ర్ బ్యూటీని హైలైట్ చేసింది. క్యూట్ స్మైల్ తో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. త్రిదా అందం చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుం టోంది. సొగ‌స‌రి వెండి తెర‌పై క‌నిపించి చాలా కాల‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. త్రిదా చౌద‌రి బెంగాలీ అందం. తొలుత అక్క‌డి చిత్రాల‌తోనే ఎంట్రీ ఇచ్చింది. అటుపై నిఖిల్ హీరోగా న‌టించిన సూర్య వ‌ర్సెస్ సూర్య చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌న‌సుకు న‌చ్చింది..7..అనుకున్న‌ది ఒక‌టి..అయ్యింది ఒక‌టి లాంటి తెలుగు చిత్రాల్లో న‌టించింది. కానీ ఇవేవి త్రిదాకి అంత‌గా పేరు తీసుకురాలేదు. హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అక్క‌డా స‌క్సెస్ కాలేదు. గత ఏడాది మాతృభాష‌లోనే బూమ్ రాంగ్ అనే సినిమాలో న‌టించింది.