Movie News

వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న రాకింగ్ స్టార్‌

రాకింగ్ స్టార్ య‌ష్.. కె.జి.య‌ఫ్ ఫ్రాంచైజీ చిత్రాల‌తో గ్లోబ‌ల్ రేంజ్ స్టార్ డ‌మ్‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు. బుధ‌వారం(జ‌న‌వ‌రి8న‌) య‌ష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులు, సినీ ప్రేక్ష‌కుల‌కు ఆయ‌న లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ నుంచి ‘బర్త్ డే పీక్’ అంటూ గ్లింప్స్ రూపంలో ట్రీట్‌ను విడుద‌ల చేశారు.ఈ వీడియోను గ‌మ‌నిస్తే య‌ష్ స్టైలిష్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా బోల్డ్ కంటెంట్‌తో సినిమా క‌థ‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించే విధానంలో హ‌ద్దుల‌ను చెరిపేసేలా బ‌ర్త్ డే పీక్ ఉంది.

య‌ష్ గ‌డ్డంతో పెడోరా, సూట్ డ్రెస్ వేసుకుని సిగార్ కాలుస్తూ స్టైలిష్‌గా క‌నిపిస్తూ క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌టాన్ని, క్ల‌బ్‌లోని ప్ర‌తీ ఒక్క‌రి దృష్టిని య‌ష్ ఆక‌ర్షించ‌టాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఆయ‌న క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తీరు వావ్ అనేలా మ‌రో డిఫ‌రెంట్ అవ‌తార్‌లో రాకింగ్ స్టార్ మెప్పించ‌టం ఖాయంగా అనిపిస్తోంది. బోల్డ్‌గా, రెచ్చగొట్టే మూమెంట్స్ తో నిండిన ఈ గ్లింప్స్‌ ప్రేక్షకులను మత్తుతో కూడిన ఆకర్షణీయమైన, హ‌ద్దులు దాటిన‌ ప్రపంచంలోకి ఆహ్వానిస్తుంది. సినిమా ఓ డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

టాక్సిక్ సినిమా గురించి, రాకింగ్ స్టార్ య‌ష్ గురించి డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ మాట్లాడుతూ ‘‘‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సినిమా రొటీన్‌కు భిన్నంగా తెర‌కెక్కించిన సినిమా. గ్లింప్స్ చూస్తుంటేనే మ‌న‌లో తెలియ‌ని ఓ డిఫ‌రెంట్ ఫీలింగ్ క‌లుగుతుంది. య‌ష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన బ‌ర్త్ డే పీక్‌ను విడుద‌ల చేశాం. య‌ష్ దేశంలో పేరున్న వ్య‌క్తి. సినిమా ప్ర‌పంచంలో డిఫ‌రెంట్ స్టైల్‌ క‌లిగిన వ్య‌క్తి. అత‌న్ని ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించే వారికి లేదా అత‌నితో క‌లిసి ప్ర‌యాణించే వారికి  త‌నెంత ముందు చూపుతో ఆలోచిస్తున్నాడ‌నే విష‌యం తెలుస్తుంది. త‌ను సినిమాల్లో చూపించ‌బోయే కొత్త‌ద‌నం గురించి బ‌య‌ట‌కు చెప్ప‌రు. కానీ వాటిని చూసిన‌ప్పుడు అసాధార‌ణంగా అనిపిస్తాయి. అత‌నితో క‌లిసి ఈ సినిమా కోసం రైట‌ర్‌గా ప‌ని చేశాను, అలాగే ఓ కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించాం. ఈ ప్ర‌యాణంలో త‌న‌తో క‌లిసి గ‌డిపిన స‌మ‌యం నాకొక  డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. రెండు భిన్నమైన ఆలోచ‌న‌లున్న వ్య‌క్తులు క‌లిసిన‌ప్పుడు ఎవరూ రాజీ ప‌డ‌రు.. అలాగే గంద‌ర‌గోళాన్ని క‌లుగ చేయ‌రు. ఆ క‌ల‌యిక స్టోరీ టెల్లింగ్‌లో స‌రిహ‌ద్దులు దాటుతుంది. భాష‌, సంస్కృతి ప‌ర‌మైన అడ్డంకులు ఏవీ ఎదురు కావు. ఓ కొత్త మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అదే ఇక్క‌డ జ‌రిగింది.