సినిమా వార్తలు

ఆహాలో ఆకట్టుకుంటోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మిస్టేక్’

‘రామ్ అసుర్‌’ త‌ర్వాత అభిన‌వ్ స‌ర్దార్ ‘మిస్టేక్‌’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆగస్ట్ 4న వచ్చిన ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అయింది. థియేటర్లో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ సినిమా మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి (సన్నీ) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మంచి ప్రశంసలే దక్కాయి. ASP బ్యానర్ మీద రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అదరగొట్టేస్తోంది.

ఆహాలో మిస్టేక్ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలోని విజువల్స్, డైలాగ్స్, కథ కథనాలు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం మెప్పిస్తున్నాయి. అభినవ్ సర్దార్ నటనతో పాటు అజయ్ క‌తుర్‌వ‌ర్‌, సుజిత్, తేజ ఐనంపూడి, క‌రిష్మా కుమార్‌, తానియా క‌ల్రా, ప్రియా పాల్ నటన కూడా అందరినీ కట్టిపడేస్తోంది.

మ‌ణి జెన్నా అందించిన పాటలు, కొట్టిన ఆర్ఆర్.. హ‌రి జాస్తి కెమెరాపనితనం.. శ్రీ హర్ష మంద‌ మాటలు ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా, విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉన్న ఈ మిస్టేక్ చిత్రం ఆహాలో విజయవంతంగా దూసుకుపోతోంది.

న‌టీన‌టులు:

అభిన‌వ్ స‌ర్దార్‌, అజయ్ క‌తుర్‌వ‌ర్‌, సుజిత్, తేజ ఐనంపూడి, క‌రిష్మా కుమార్‌, తానియా క‌ల్రా, ప్రియా పాల్ త‌దిత‌రులు