Monday, May 12, 2025
HomeMovie Newsతప్పకుండా నవీన్ చంద్ర కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్సం-సందీప్ కిషన్

తప్పకుండా నవీన్ చంద్ర కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్సం-సందీప్ కిషన్

నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్,  రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్. ఈ చిత్రం ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. రుచిర ఎంటర్టైన్మెంట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

- Advertisement -

ప్రీరిలీజ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. సీజ్ ఫైర్ సమాచారం వచ్చిన తర్వాత ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మన కోసం ప్రాణం పెట్టి పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి బిగ్ సెల్యూట్. ఒక నటుడిగా సైనికులకి ఎంత సహాయం చేయగలనో అది చేస్తాను. మీరు కూడా మీ వంతు కుదిరిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను. వారు మన సహాయం కోసం ఆధారపడలేదు. వారి  త్యాగానికి ఇది మన బాధ్యత. సినిమా విషయానికొస్తే.. ఈ వేడుకకు వచ్చే ముందు ఇది నవీన్ సినిమా. టైటిల్ లెవన్ ఇదొక్కటి మాత్రమే నాకు తెలుసు. తనకి మంచి జరగాలని సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. నవీన్ నాకంటే సీనియర్. తన ప్రతి సినిమా తన టాలెంట్ తోనే తెచ్చుకున్నాడు. ఆడిషన్స్ ఇచ్చే తెచ్చుకున్నాడు. తన ప్రతిభను గుర్తించే అవకాశం వచ్చింది. అదృష్టాన్ని కాకుండా కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న యాక్టర్ నవీన్ . తన ప్రతి సినిమాలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నవీన్ కి ఇది గుడ్ డే. తెలుగు తమిళ్ బైలింగ్వల్ చేయడం అంటే డబ్బులతో పోరాటం. ప్రతి సీన్ 2 సార్లు చేయాలి. రెండు చోట్ల ప్రమోషన్ చేయాలి .ఇది తెలుగు సినిమానా తమిళ్ సినిమానా అని ప్రతి ఒక్కరికి వివరణ ఇచ్చుకోవాలి. ఇవన్నీ దాటి కూడా చేయడానికి కారణం అక్కడున్న ఆడియన్స్ పట్ల భాష పట్ల ప్రేమ. ఆడియన్స్ మన కష్టానికి తగిన ప్రేమ ఇవ్వరా అనే ఒక గుడ్డి కోరిక. ఈ సినిమా నవీన్ కి చాలా మంచి సక్సెస్ ఇస్తుందని కోరుకుంటున్నాను. సినిమా మీద విపరీతమైన పాషన్ ఉంటేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఈ సినిమా ట్రైలర్ చూశాను ట్రైలర్లో క్రాఫ్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ లోకేష్ చాలా అద్భుతంగా సినిమాని తీసాడు అనిపించింది. ఇది కథని కంటెంట్ ని నమ్ముకుని చేసిన సినిమా. నటీనటులు టెక్నీషియన్స్ ద బెస్ట్ ఇచ్చారని అనిపిస్తోంది. ఇమాన్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ తెలుగు సినిమా నాతోనే చేశారు. ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మే 16న ఈ సినిమా రాబోతుంది. అందరూ థియేటర్స్ లో చూడండి. నవీన్ కి ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను’అన్నారు

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మనల్ని రక్షించడానికి వీరోచితంగా పోరాడుతున్న మన సైనికులకి బిగ్ సెల్యూట్. జైహింద్. ఈ సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. వాళ్ల రియాక్షన్స్ చూసినప్పుడు నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. మే 15న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేశాం. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి చూసి ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు నేను అక్కడే నిల్చుని ఉంటాను ఒకవేళ మీకు సినిమా నచ్చకపోయి ఉంటే మీ టికెట్ ని వెనక్కి అడిగే హక్కు మీకు ఉంది. ఒకవేళ సమయం వృధా అయిందని అనిపించినా ప్రశ్నించే హక్కు కూడా మీకు ఉంటుంది. నేను చేసే కథలు పాత్రలు బావుంటాయని ప్రేక్షకులు మొదటినుంచి ప్రశంసిస్తున్నారు. ఆ గౌరవానికి రిటర్న్ గా ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమాని నిర్మాతలు ఎంతో ఫ్యాషన్తో తీశారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం రెడ్ చిల్లీస్ ని తీసుకొచ్చారు. అది ఈ సినిమా మీద ఆయనకున్న నమ్మకం. ఆడియన్స్ కి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మే 16న సినిమా రిలీజ్ అవుతుంది. నా కథే నా బలం. ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది . ఈ సినిమాలో ఉన్న యూనిక్ కాన్సెప్ట్ ని ఇప్పటివరకు మీరు ఏ థ్రిల్లర్ లో కూడా చూసి ఉండరు. ఒక 30 మినిట్స్ చాలా ఎమోషన్ కి గురి అవుతారు. ఆ ఎమోషన్ ఆడియన్స్ కి ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మా ట్రైలర్ ని లాంచ్ చేసిన కమల్ హాసన్ గారికి ధన్యవాదాలు. ఆయన లాంచ్ చేయడంతో ట్రైలర్ చాలా అద్భుతమైన రీచ్ తో వెళ్ళింది. ధనుష్ గారు ఆర్య గారు సిమ్భు గారు శ్రీ విష్ణు గారు సందీప్ కిషన్ గారు సుహాస్ విశ్వక్సేన్ అందరికీ ధన్యవాదాలు. నేను అడిగినప్పుడల్లా ఈ సినిమా కోసం అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. ఈ వేడుకకు వచ్చిన గెస్ట్ లందరూ చాలా నిజాయితీగా నేను సంపాదించుకున్న వాళ్ళు. నేను ఏ సినిమా చేసిన సపోర్ట్ చేసే మీడియాకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కిరీటి, రవి వర్మ గారు, శశాంక్, అభిరామి గారు అందరు కూడా చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. ప్రొడ్యూసర్ గా యాక్టర్ గా నన్ను నమ్మినందుకు రియాకి థాంక్యూ. నన్ను నమ్మి ఇంత పెద్ద బడ్జెట్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇమాన్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. కష్టపడుతున్నాను మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. మే 16న ఈ సినిమా వస్తుంది. కచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. డైరెక్టర్ లోకేష్ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. తెలుగు తమిళ్ రెండిట్లోనూ  ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ని రాబట్టుకున్నాడు. ఈ సినిమాని ఫస్ట్ టైం చూసినప్పుడు ఒకలా అనిపిస్తుంది. సెకండ్ టైం చూసినప్పుడు మరో కోణం కనిపిస్తుంది. మీకు ఫస్ట్ టైం నచ్చితే సెకండ్ టైం తప్పకుండా చూడండి. అలాగే ఈ సినిమా టైటిల్ లోనే చాలా క్లూస్ ఉన్నాయి. ఎవరైనా ఆ క్లూస్ ని డీకోడ్  చేస్తే వాళ్ళకి చాలా మంచి గిఫ్ట్ ఇస్తాను. నేను ఏ సినిమా చేసిన నాకు సపోర్ట్ గా ఉండే వ్యక్తి సందీప్ కిషన్. తను ఈరోజు గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను’అన్నారు.

డైరెక్టర్ లోకేష్ మాట్లాడుతూ..  అందరికీ నమస్కారం. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఒక సినిమాకి స్టార్ కాస్ట్ సరిగ్గా సెట్ అయిందంటే ఆ సినిమా సగం గెలిచినట్లే. ఆ రకంగా ఈ సినిమా సగం గెలిచింది . ఇందులో నటించిన అందరూ కూడా మంచి పెర్ఫార్మర్స్. ఇమాన్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద పిల్లర్. సినిమా చూసిన ఆడియోస్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్తారు. డిఓపి కార్తిక్ నాకు బ్యాక్ బోన్. తన విజువల్స్ లేకపోతే ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు. నవీన్ గారికి కలిసి కథ చెప్పాను. కథ విన్న దగ్గర్నుంచి ఈరోజు వరకు ఆయన తన ప్రతి ఎఫర్ట్ ఈ సినిమా కోసం పెట్టారు. డైరెక్టర్ కి ఏం కావాలో డైరెక్టర్లు మనసులోని మాటని తెలుసుకునే యాక్టర్ నవీన్ గారు. ఆయన కళ్ళతోనే మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ని ఇవ్వగలరు. ఆయన ఫ్యూచర్లో మరిన్ని గొప్ప సినిమాలు చేస్తారు. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా తప్పకుండా వారికి మంచి విజయాన్ని ఇస్తుందని నమ్మకం ఉంది.చాలా నిజాయితీతో తీసిన సినిమా ఇది. తప్పకుండా సినిమా చూడండి ఇది మీ విష్ లిస్టులో ఉండే సినిమా అవుతుంది’అన్నారు

డైరెక్టర్ కరుణకుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం .ఈ సినిమా వేడుకకు రావడానికి కారణం నవీన్ చంద్ర గారు. ప్రతి సినిమాని ప్రతి క్యారెక్టర్ని తన సినిమా లాగా భావించి చేసే నటుడు నవీన్ చంద్ర గారు. మట్కాలో ఆయనతో వర్క్ చేసిన తర్వాత మా అనుబంధం మరింత పెరిగింది. ఇప్పుడు చేయబోతున్న సినిమాలో ఆయనే హీరో కావడం చాలా ఆనందాన్నిస్తుంది. మే 16న అందరూ థియేటర్స్ వచ్చి లెవన్ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. .

హీరోయిన్ రియా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నన్ను బిలీవ్ చేసిన డైరెక్టర్ లోకేష్ గారికి థాంక్యూ. ఇమాన్ గారి మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన మ్యూజిక్ ఈ సినిమాల్లో ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. నవీన్ గారు అమేజింగ్ ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది. మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ఈ మా మంచి సినిమాని కూడా ఆడియన్స్ సపోర్ట్ చేసి పెద్ద విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను.

అభిరామి మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు గర్వంగా చెప్పుకునేలా ఉంటాయి. అలాంటి సినిమా ఇది. నేను సినిమా చూశాను డెఫినెట్గా ఆడియన్స్ కి ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మా టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమా తెలుగు తమిళ్లో ఒక వైల్డ్ ఫైర్ లాగా మారుతుందని భావిస్తున్నాను. నవీన్ చంద్ర గారికి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఆయన ఫ్యూచర్లో చాలా గొప్ప స్థాయికి వెళ్తారని భావిస్తున్నాను. ఇది చాలా మీనింగ్ ఫుల్ మూవీ దయచేసి అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రభు సాల్మన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా మనసుకి చాలా దగ్గరైన సినిమా ఇది. ఇందులో నవీన్ గారు చేసిన క్యారెక్టర్ వెరీ చాలెంజింగ్. నేను సినిమా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. ఆడియన్స్ కి కూడా చాలా నచ్చుతుంది. ఈ  సినిమానే మాట్లాడుతుంది. సినిమా విజువల్ ట్రీట్ గా ఉంటుంది. తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు.

మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమాన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. దాదాపు 100కు పైగా సినిమాలు చేశాను. కానీ ఇదే నా ఫస్ట్ క్రైమ్ థ్రిల్లర్. డైరెక్టర్ ఎంత అద్భుతంగా ఈ కథ చెప్పారు అంతే అద్భుతంగా స్క్రీన్ మీదకు వచ్చింది. ఈ సినిమా తెలుగు తమిళ్లో వండర్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను’అన్నారు

డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నవీన్ ఏ సినిమా చేసిన అందులో చాలా మంచి కంటెంట్ ఉంటుంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నవీన్ గారు ఒక క్యారెక్టర్ లో చాలా ఇంటెన్స్ గా ఉండే యాక్టర్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుందని నమ్మకం కలిగింది. నవీన్ గారు తన పని చేసిన డైరెక్టర్స్ కి చాలా హెల్ప్ ఫుల్ గా ఉండే యాక్టర్. ఈ సినిమా నవీన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.

డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం ఈ టైటిల్ చూడగానే ఇది కాన్సెప్ట్ సినిమా అని అర్థం అవుతుంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా చూడ్డానికి ఈగర్ గా ఎదురుచూస్తున్నాను. నవీన్ గారు అద్భుతమైన యాక్టర్ ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను.

డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నవీన్ చంద్ర గారికి నవీన్ చంద్ర గారంటే నాకు చాలా గౌరవం. ఆయన గ్రేట్ యాక్టర్. ఒక రైటర్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఆయన ఊహించుకొని ఒక పాత్రని రాస్తారు. నేను చూసిన ఇండస్ట్రియల్ నేను చూసిన ఫస్ట్ బిగ్ పార్టీ కూడా ఆయన సినిమాదే. ఇమాన్ గారి మ్యూజిక్ కంటే నాకు చాలా ఇష్టం. థ్రిల్లర్ జోనర్ అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

రైటర్ లక్ష్మీ భూపాల మాట్లాడుతూ.. బ్రదర్ నవీన్ చంద్ర అందాల రాక్షసి ఫంక్షన్ తర్వాత తన సినిమాక వేడుకకు రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇంటెన్స్ థ్రిల్లర్ అనిపించింది. నవీన్ చంద్ర చాలా వెర్సెటైల్ రూల్స్ చేస్తున్నాడు. ఈ సినిమా తనకి పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

లిరిక్ రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ… ఇందులోని పాటల్ని సరికొత్తగా రాయడం జరిగింది. ఇందులో ఓ పాటని రెండు భాషల్లో కలిపి రాస్తే ఎలా ఉంటుందోనే ఆలోచనతో ఒక పాట రాయడం జరిగింది. పాట చాలా బాగా వచ్చింది. చాలా మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ ఇది. డైరెక్టర్ గారు చాలా హానెస్ట్ గా తీశారు. అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను. నా మొదటి సినిమా అందాల రాక్షసి నవీన్ గారికి రాశాను మళ్ళీ ఈ సినిమాకి రాయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.’అన్నారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read