ఒటిటి లు అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుండి థియేటర్స్ కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గింది. థియేటర్స్ లో విడుదలైన 20 రోజులకే ఒటిటి లో సినీ రిలీజ్ అవుతుండడం తో సినీ లవర్స్ అంత ఒటిటి కే అలవాటు పడ్డారు. ప్రతి వారం కొత్త సినిమా సిరీస్‌లు ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కోట్లు ఖర్చు చేసి మరీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్నాయి. అయితే ఈ వారం ప్రభాస్ కల్కి థియేటర్లలోకి వచ్చి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ వీకెండ్‌తో పాటు వచ్చే వారం మొత్తం ఈ సినిమా హవానే ఉంటుంది. ఇదే సమయంలో చాలా మంది టికెట్లు దొరకక ఇబ్బంది కూడా పడుతున్నారు. కానీ ఇదే సమయంలో ఓటీటీలో కొన్ని క్రేజీ సినిమా సిరీస్‌లు ప్రేక్షకుల్ని పలకరించేందుకు వచ్చేశాయి.
ఒక్కరోజే(జూన్ 28) ఏకంగా 13 చిత్రాలు అందుబాటులో వచ్చాయి. కార్తికేయ భజే వాయువేగం, కాజల్ అగర్వాల్ సత్యభామ, నవదీప్ లవ్ మౌళి వచ్చాయి.
వీటితో పాటు..
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఆవేశం (హిందీ డబ్బింగ్ సినిమా)- జూన్ ౨౮
అమెజాన్ ప్రైమ్‌లో
సత్యభామ (తెలుగు సినిమా)- జూన్ 28
సివిల్ వార్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 28
శర్మాజీ కీ బేటీ (హిందీ చిత్రం)- జూన్ 28
నెట్‌ఫ్లిక్స్‌లో
భజే వాయు వేగం (తెలుగు సినిమా)- జూన్ 28
ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28
ది కార్ప్స్ వాషర్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 28
ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28
ది విర్ల్ విండ్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూన్ 28
జీ5
రౌతు కీ రాజ్ (హిందీ చిత్రం)- జూన్ 28
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ
ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28
వండల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28
సైనా ప్లే
హిగ్యుటా (మలయాళ మూవీ)- జూన్ 28
సో..కల్కి టికెట్స్ దొరకని వారు ఎంచక్కా ఈ సినిమాలు ఇంట్లో చూసేయ్యొచ్చు.