నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. ఈరోజు, చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా సెకండ్ సింగిల్- ముచ్చటగా బంధాలే సాంగ్ ని లాంచ్ చేశారు.
స్టార్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ముచ్చటగా బంధాలే, కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకుల భావోద్వేగ అనుబంధంను సున్నితంగా చిత్రీకరించిన మేలోడిక్ మాస్టర్ పీస్.
రఘు రామ్ సాహిత్యంతో కూడిన ఈ పాట తల్లి స్వభావాన్ని హైలైట్ చేస్తుంది, ఆమె తన కొడుకు విజయం సాధించాలనే కలలను సాకారం చేసుకుంటూ, అతనికి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదే సమయంలో, కొడుకు తన తల్లిని సంతోషంగా, గర్వంగా ఉంచేందుకు ఎంతో ప్రయత్నిస్తాడు.
తల్లి-కొడుకుల బంధంతో పాటు, ఈ పాట కళ్యాణ్ రామ్ ప్రేమ వైపు ఒక గ్లింప్స్ అందిస్తుంది, సాయి మంజ్రేకర్‌తో అతని సున్నితమైన రిలేషన్ ని పాటకు అదనపు ఎమోషన్ ని జోడిస్తుంది.
హరిచరణ్ సోల్ ఫుల్ వాయిస్ ఈ పాట ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసింది,మొత్తంమీద, ముచ్చటగా బంధాలే తల్లి-కొడుకుల బంధానికి హృదయపూర్వక నివాళి.


ఈ చిత్రానికి సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా.
ఇప్పటికే హ్యుజ్ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది.