గత కొన్ని రోజులుగా పుష్ప 2 హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. అయితే, ఈ వారం థియేటర్లు కొత్త సినిమాల తో సందడిగా మారబోతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేలా వివిధ జోనర్‌లకు చెందిన సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగు, తమిళ చిత్రాలు మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు కూడా ఈ వారం ప్రేక్షకులను అలరించబోతున్నాయి.
బచ్చల మల్లి :
అల్లరి నరేశ్ హీరోగా, సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వచ్చిన బచ్చల మల్లి ఈ వారం విడుదల కానుంది. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లతో మంచి అంచనాలు ఏర్పరచుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది.
యూఐ – ఉపేంద్ర వినూత్న ప్రయత్నం :
కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన యూఐ కూడా ఈ వారం విడుదలకానుంది. ఫాంటసీ నేపథ్యంలో వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఉపేంద్రకి కొత్తపుంతలు తొక్కిస్తుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, భారీ అంచనాలతో ప్రేక్షకుల మదిని గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
విడుదలై పార్ట్ 2 :
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై పార్ట్ 2 కూడా ఈ వారం విడుదల కానుంది. గతేడాది భారీ విజయాన్ని అందుకున్న తొలి భాగం తర్వాత, ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 20న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం, విభిన్న కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం.
సారంగపాణి జాతకం :
ప్రియదర్శి ప్రధాన పాత్రలో, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన సారంగపాణి జాతకం ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ చిత్రం కథ, దర్శకత్వం, ప్రియదర్శి నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. డిసెంబరు 20న విడుదల కానున్న ఈ చిత్రం, వినూత్న కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు చెబుతున్నారు. ఇలా ప్రతీ సినిమా తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉండటంతో, ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుందనడంలో సందేహం లేదు. థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు కూడా కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి చేయబోతున్నాయి.
ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
ఈటీవీ విన్ ఓటీటీలో
లీలా వినోదం (తెలుగు) డిసెంబరు 19
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
లవ్ టూ హేట్ ఇట్ జూలియస్ (హాలీవుడ్) డిసెంబరు 17
ఇనిగ్మా (హాలీవుడ్) డిసెంబరు 17
వర్జిన్ రివర్ 6 (వెబ్‌సిరీస్) డిసెంబరు 19
ది డ్రాగన్ ప్రిన్స్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 18
స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) డిసెంబరు 18
ద సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (హాలీవుడ్) డిసెంబరు 20
యోయో హనీసింగ్ (ఫేమస్ హిందీ డాక్యుమెంటరీ) డిసెంబరు 21
జియో సినిమా ఓటీటీలో
ట్విస్టర్స్ (హాలీవుడ్) డిసెంబరు 18
మూన్‌వాక్ (హిందీ) డిసెంబరు 20
తెల్మా (హాలీవుడ్) డిసెంబరు 21
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
బీస్ట్ గేమ్స్ (హాలీవుడ్) డిసెంబరు 18
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ) డిసెంబరు 18
లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో
బాయ్ కిల్స్ వరల్డ్ (హాలీవుడ్) డిసెంబరు 20
మనోరమా మ్యాక్స్ ఓటీటీలో
పల్లొట్టీ నైన్టీస్ కిడ్స్ (మలయాళం) డిసెంబరు 18