Movie News

‘లైలా’ ఫన్ రైడ్ లా ఉంటుంది – నిర్మాత సాహు గారపాటి

మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్  ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

లైలా సినిమా నిర్మించడానికి మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
-మెయిన్ కామెడీ. దీంతో పాటు ఒక హీరో ఇలాంటి కథని చేస్తానని యాక్సప్ట్ చేయడం నాకు చాలా నచ్చింది. అంతకుముందు కొందరు హీరోలని సంప్రదించాం. లేడి గెటప్ చేయడం అంత ఈజీ కాదు. విశ్వక్ చేస్తానని చెప్పడంతో నాకూ ఇంట్రస్ట్ కలిగి ముందుకు తీసుకెళ్ళాం.

లైలా, సోను క్యారెక్టర్స్ బ్యాలెన్స్ ఎలా వుంటుంది ?
-ఫస్ట్ హాఫ్ అంతా సోను వుంటాడు. తన లవ్ స్టొరీ ఫస్ట్ హాఫ్ లో వుంటుంది. అనుకోని కారణంగా తనని లైలా గా మార్చుకొని ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకుంటాడు. ఆ రీజన్ చాలా ఎమోషనల్ గా వుంటుంది.  

-యూత్ ని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది ?
యూత్ ని టార్గెట్ చేశాం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. నవ్వించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. అందులో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం.

రేపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈవెంట్ కి వస్తున్నారు కదా.. ఆయన ట్రైలర్ చూశారా ?
-ట్రైలర్ చూశారు. కొత్త ప్రయత్నం చేశామని విశ్వక్ ని మెచ్చుకున్నారు. ఆయనకి ట్రైలర్ చాలా నచ్చింది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన రావడం మా అదృష్టం.  

చిరంజీవి గారితో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ?
-మే, జూన్ లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తాం. అనిల్ రావిపూడి మార్క్ లో పర్ఫెక్ట్  కమర్షియల్ సినిమాలా వుంటుంది. వింటేజ్ చిరంజీవి గారిలా ఆయన రోల్ ఉంటుంది.  

డైరెక్టర్ రామ్ నారాయణ్ గురించి ?
-తన కథకు తగ్గట్టుగా విశ్వక్ ని చూపించడంలో డైరెక్టర్ వందశాతం సక్సెస్ అయ్యాడు. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. లైలా అనే టైటిల్ దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఫిక్స్ చేసుకున్నాడు. తను అనుకున్నది పెర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు.  

ఒక నిర్మాత కావాలని వచ్చిన వారికి మీరు ఏం చెప్తారు ?
-ఫ్రాంక్ గా చెప్పాలంటే మార్కెట్ కొంచెం ఇబ్బంది గానే వుంది. మనం అనుకున్న బడ్జెట్ లో చూసుకుంటే హ్యాపీ. పెరిగితే ఎవరికైనా ఇబ్బందే.

బెల్లంకొండ గారితో తీస్తున్న  సినిమా గురించి ?
-డెబ్బై శాతం షూటింగ్ ఫినిష్ అయ్యింది. అది హారర్ థ్రిల్లర్. జూన్ లో రిలీజ్ చేస్తాం. ఈ సినిమాతో పాటు మరిన్ని కొన్ని అనౌన్స్ చేయబోయే మూవీస్ వున్నాయి. స్క్రిప్ట్ మీద వర్క్ జరుగుతోంది.