Movie News

సమంతకు ఫామ్‌హౌస్ గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన సమంత.. వెబ్ సిరీస్‌ల ద్వారా బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, మయోసైటిస్ వ్యాధితో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు సమంత శక్తివంతంగా పునరాగమనానికి సిద్ధమవుతోంది. నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ చికిత్సతో పాటు నాన్న మరణం వంటి పలు దెబ్బల నుంచి బయటపడేందుకు ఆమె ఎంతో పడుతున్నారు.

సమంత కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ‘అల్లుడు శ్రీను’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్ కేటాయించారు. దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచినా, బెల్లంకొండ సురేష్‌కు లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా షూటింగ్ సమయంలో సమంత అనారోగ్య సమస్యలతో బాధపడింది. చికిత్స కోసం ఆమెకు డబ్బులు అవసరమైన సమయంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ ముందుకు వచ్చి రూ. 25 లక్షల సాయం అందించారు. ఈ మొత్తాన్ని సమంత తన పారితోషికం నుండి సర్దుబాటు చేసింది. సినిమాకు ఆమె చేసిన కృషికి సంతృప్తి చెందిన సురేష్, ఈ సందర్భంగా సమంతకు ఫామ్‌హౌస్‌ను బహుమతిగా ఇచ్చారు.

ఈ విషయాన్ని ఇటీవల బెల్లంకొండ సురేష్ ఓ తెలుగు చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అగ్ర కథానాయిక అయినప్పటికీ, కొత్త హీరోతో నటించినందుకు సమంతను ఆయన ఎంతో అభినందించారు. ఈ విషయాలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ తన ‘లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ పతాకంపై వరుసగా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.