విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రేపు ఓటిటి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో విజయ్ దేవరకొండ , మృణాల్ ఠాకూర్ జంటగా దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మొదటి ఆట తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకొని..బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ గా మిగిలింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ప్రముఖ OTT ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో రేపటి ( ఏప్రిల్ 26 ) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేట్రికల్ రన్ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ను ఎలా అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా ఫై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు విజయ్..కానీ ఫైనల్ గా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా ద్వారా దిల్ రాజు కు సైతం భారీ నష్టాలు వచ్చాయి.