Monday, May 6, 2024
HomeMovie Newsచిరంజీవి తల్లి చేతుల మీదుగా ‘ది 100’ టీజర్ విడుదల

చిరంజీవి తల్లి చేతుల మీదుగా ‘ది 100’ టీజర్ విడుదల

- Advertisement -

‘మొగలి రేకులు’ ఫేమ్ సాగర్ హీరోగా రాఘవ్ ఓంకార్ శశిధర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ది 100’. ఈ మూవీ టీజర్ ను శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేసి సినిమా కు బజ్ తీసుకొచ్చారు. మానవ హక్కుల కమిషన్ విచారణను ఎదుర్కొంటున్న IPS అధికారి విక్రాంత్‌ అనే సీన్‌తో టీజర్ ప్రారంభమైంది. విక్రాంత్ ఐపీఎస్ పాత్రలో సాగర్ ఆకట్టుకున్నాడు. టీజర్ మొత్తం ఆసక్తిగా..నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనే విధంగా కట్ చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు.

మిషా నారంగ్ హీరోయిన్‌గా నటించగా.. ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. KRIA ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ పతాకాలపై రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జే తారక్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read